భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. ఓ రోజు గొడవ పడినా.. మరో రోజు వాటికి అవే సర్దుకుపోతుంటాయి. ఇలా కష్టాలు, సుఖాలతో ఫ్యామిలీని ముందుకు నడుపుతూ ఉంటారు దంపతులు. కానీ ఓ భార్య తన భర్తను ఏ పని చేసినా.. తిడుతూ ఉండేది. దీంతో అతడు ఓ రోజు భార్య పోరు భరించలేక.. ఏం చేశాడో తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ లోని జామ్‌నగర్ రోడ్డులోని బజ్‌రంగ్ వాడి వద్ద దంపతులు నివసిస్తున్నారు.
అతడి పేరు దేవ్జీ చవ్దా. అతడితో పాటు తన భార్య కూడా ఉంటుంది. పెళ్లైన మొదట్లో ఇద్దరు బాగానే ఉండేవారు. కొన్ని రోజుల నుంచి తన భార్య అయినదానికీ, కానిదానికీ లెక్చర్లు ఇస్తుండటంతో విసిగిపోయాడు. ఏం చేసినా.. మాట్లాడినా అందులో పెడర్ధాలు తీస్తూ ఇష్టం వచ్చినట్లు తిడుతుందని చెప్పి వాపోయాడు. దీనికి బదులు జైలుకు వెళ్లితే తిండితో పాటు కాస్త మనశ్శాంతి కలుగుతుందని భావించాడు.
అనుకున్నట్లుగానే అతడు.. ఆదివారం సాయంత్రం తన ఇంటికి ఎదురుగా ఉన్న పోలీస్ చౌకీ వద్దకు వెళ్లి దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అక్కడే నిలబడి చూస్తున్నాడు. అక్కడ నుంచి అడుగు కూడా ముందుకు వేయలేదు. గమనించిన స్థానికులు అక్కడకి వచ్చి మంటలను అదుపు చేశారు. అనంతరం అక్కడే ఉన్న వ్యాపారులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఎందుకు ఇలా చేశావు.. అని ప్రశ్నించారు పోలీసులు. దీంతో అతడు చెప్పిన సమాధానానికి పోలీసుల మైండ్ గిర్రున తిరిగింది. భార్య పోరు భరించలేకనే తాను ఇలా చేసినట్లు తెలిపాడు. ఘటనా స్థలంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. అతడిని అదుపులోకి తీసుకొని.. దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…