ఒకప్పుడు గ్యాస్ సిలిండర్ అనేది తెలియని రోజుల్లో ప్రతీ ఒక్కరు ఇంట్లోనే కట్టెల పొయ్యి వాడి వాటిపైనే వంట చేసుకునే వారు. కానీ కాలం మారింది. ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ఇంట్లో గ్యాస్ అనేది ఉంది. గ్యాస్ పొయ్యి లేని గుమ్మం లేదంటే అతిశయోక్తి కాదు. అయితే గ్యాస్ ఉపయోగించే గృహిణులకు ఎప్పటి నుంచో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంది.
అదేంటంటే.. సిలిండర్ లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు. కేవలం వాళ్లు గ్యాస్ ఫిల్ చేసిన రోజును గుర్తుపెట్టుకొని ఎప్పుడు అయిపోతుందనే ఒక అంచనాకు వస్తారు. కొంతమందికి ఆ సిలిండర్ బండను పైకి లేపి గుర్తిస్తారు. ఇలా చేయడం కొంతవరకు అంచనాలు నిజమే అవ్వొచ్చు కానీ.. 100 శాతం అని చెప్పలేము కదా.. అయితే ఇక వారికి ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు.
ఇక్కడ చెప్పే పద్దతిలో సిలిండర్ లో గ్యాస్ ఎంత ఉందో కచ్చితంగా తెలుసుకోవచ్చు. దాని కోసం ఏం చేయాలంటే.. ఒక గుడ్డను తీసుకొని తడపాలి. ఆ తడిచిన గుడ్డను గ్యాస్ సిలిండర్ చుట్టూ చుట్టి ఒక నమిషం పాటు ఉంచాలి. తర్వాత గుడ్డను తీసేయాలి. అప్పుడు సిలిండపై జరిగే మార్పులను మనం గమనించవచ్చు.
అందేంటంటే.. సిలిండర్ లో గ్యాస్ సంగం వరకు ఉంటే మిగతా సంగం అంతా తడిగాను.. మిగిలిన సగం వరకు పొడిగాను ఉంటుంది. వివరంగా చెప్పాలంటే.. ఆ గుడ్డను తీసిన తర్వాత సిలిండర్ పై రెండు మార్పులు కనపడుతాయి. ఒకటి సిలిండర్ పై తడిగా కనిపించే భాగంలో గ్యాస్ ఉన్నట్లు.. తడిగా లేకుండా ఎండిపోయి ఉంటే మాత్రం అక్కడ గ్యాస్ లేనట్లుగా గమనించాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…