Bigg Boss: బిగ్ బాస్ సెట్లో అగ్ని ప్రమాదం...! తప్పిన పెను ముప్పు..!
Bigg Boss: బిగ్ బాస్ ఈ షోకు ఉండే క్రేజ్ వేరు. హిందీలో మొదటగా ప్రారంభమైన ఈ షో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ప్రారంభం అయింది. మన దేశ కల్చర్ ను బిగ్ బాస్ పాడు చేస్తుందంటూ.. చాాలా మంది అనుకుంటున్నా.. కూడా ఈషో చూసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తోంది. చిన్న నుంచి పెద్ద వరకు ఈ షోను ఎంజాయ్ చేస్తున్నారు.
అప్పటి వరకు కొంత మందికే పరిచయం ఉన్న వారిని ఓవర్ నైట్ లో బిగ్ బాస్ స్టార్లను చేస్తోంది. బిగ్ బాస్ ఇచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్లు రియాలిటీ షోలు, టీవీ షోలు, సినిమాల్లో ఛాన్సులు కొల్లగొడుతున్నారు. కొంత మంది సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా తెలుగు బిగ్ బాస్5 సీజన్ లో విన్నర్ గా నిలిచిన వీజే సన్నీ కూడా ‘సకలగుణాభిరామ’ సినిమాలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు.
హిందీ బిగ్ బాస్ షోకు దేశంలో పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఉన్నారు. తాజాగా ఈ షో గ్రాండ్ ఫినాలే జనవరి 30న జరిగింది. ప్రేక్షకులు తేజస్వి ప్రకాష్‌కి పట్టం కట్టారు. అత్యధిక ఓట్లు సంపాదించినా తేజస్వి టైటిల్ సొంతం చేసుకున్నాడు. షెహజ్ పాల్ రన్నరప్‌గా నిలిచాడు. బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి ప్రకాష్ టైటిల్ ఫేవరేట్‌గానే ముందు షోకు ఎంట్రీ ఇచ్చింది. అప్పట్నుంచి తనదైన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది తేజస్వి.
ఇదిలా ఉంటే.. హిందీ బిగ్ బాస్ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సెట్ ముంబైలోని ఫిలిమ్ సిటీలో ఉంది. రెండు వారాల క్రితం బిగ్ బాస్ ముగిసినా.. సెట్ మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం దీంట్లోనే అగ్ని ప్రమాదం సంబవించింది. అయితే సెట్ లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగడంతో నాలుగు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పేశాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…