Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈయన ప్రస్తుతం రాజకీయాలలోను అలాగే సినిమాలలోను నటిస్తూ కెరియర్ పరంగా దూసుకుపోతున్నారు. వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి బాలయ్య మరోవైపు ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గం నుంచి ఇప్పటికి మూడుసార్లు విజయం సాధించి సంచలన సృష్టించారు.
ఇలా హిందూపురం ప్రజల కష్టాలలో తోడుగా ఉంటూ వారి అవసరాలన్ని తీరుస్తున్న బాలయ్యకు మరోసారి హిందూపురం ప్రజలు పట్టం కట్టారు. ఇక బాలకృష్ణ గెలిచిన అనంతరం ఆయన తన పుట్టినరోజు వేడుకలను కూడా హిందూపురంలోనే జరుపుకున్నారు. జూన్ 10వ తేదీ బాలయ్య పుట్టినరోజు కావడంతో ఈసారి హిందూపురంలో ఈయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
ప్రతిసారి హైదరాబాదులో పుట్టినరోజు వేడుకలు జరుపుకునే బాలయ్య ఈసారి ఊహించని విధంగా తాను పోటీ చేసి గెలిచిన చోటే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు .అయితే ఈ పుట్టినరోజు వేడుకలలో భాగంగా బాలకృష్ణ అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు. 2014వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.
కడుపు నిండా భోజనం..
ఈ అన్న క్యాంటీన్లలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల కొనసాగించలేకపోయారు. దీంతో 2024 కూటమి అధికారంలోకి రావడంతో తిరిగి అన్న క్యాంటీన్ లు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ క్రమంలోనే మొట్టమొదటి అన్న క్యాంటీన్ ని బాలకృష్ణ హిందూపురంలో ప్రారంభించారు. ఈ అన్నా క్యాంటీన్ లో ఐదు రూపాయలకే ప్రజలందరికీ కడుపునిండా భోజనం పెడుతున్న సంగతి తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…