దేశంలోని ప్రజల మధ్య చాలా సంవత్సరాల నుంచి ఏలియన్ల గురించి చర్చ జరుగుతోంది. ఏలియన్లు ఉన్నాయని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతుంటే మరి కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఏలియన్లు లేవని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు రేడియో తరంగాలను పంపించడం ద్వారా ఏలియన్లు ఉన్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు శాస్త్రవేత్తలు పంపిన సందేశాలకు ఏలియన్ల నుంచి స్పందన రాలేదు.
అయితే హార్వర్డ్ ప్రొఫెసర్ లోయెబ్ మాత్రం 2017 సంవత్సరంలోనే భూమిపైకి ఏలియన్లు వచ్చాయని వెల్లడిస్తున్నారు. 2017 సంవత్సరం భూమిపై సిగార్ ఆకారంలో ఉన్న ఆస్టరాయిడ్ దొరికిందని భూమిపై ఏలియన్లు ఉన్నాయని చెప్పడానికి సాక్ష్యం ఇదేనని ఆయన అన్నారు. లోయబ్ ఆయన రాసిన కొత్త పుస్తకంలో ఈ విషయాలను పేర్కొన్నారు. వేవార్డ్ ఏలియన్ టెక్నాలజీ ద్వారా దొరికిన ఆస్టరాయిడ్ ఏలియన్లదే అని గుర్తించామని అన్నారు.
వేరే గెలాక్సీ నుంచి ఆ ఆస్టరాయిడ్ భూమిపైకి వచ్చిందని.. వింతరీతిలో ఆ ఆస్టరాయిడ్ కదులుతోందని తెలిపారు. స్వచ్చమైన కేంద్రబిందువు నుంచి ఆ ఆస్టరాయిడ్ వచ్చిందని గతేడాది చేసిన పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. భూమికి 25వేల కాంతి సంవత్సరాల దూరం నుంచి ప్రయాణించి ఆ ఆస్టరాయిడ్ భూమిని చేరిందని లోయబ్ అన్నారు. ఆ ఆస్టరాయిడ్ 2017 సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన సౌర వ్యవస్థ ఆర్బిటర్ తలాన్ని దాటిందని వెల్లడించారు.
మనుషులు మాత్రమే అంతరిక్షంలో ఏలియన్లు ఉన్నాయని చెప్పడానికి సాక్ష్యం అని.. ఆ ఆస్టరాయిడ్ ఏలియన్ సంతతికి చెందిన ఆస్టరాయిడ్ అని తాము భావిస్తున్నామని లోయబ్ చెప్పుకొచ్చారు. లోయబ్ చేసిన తాజాగా ప్రకటనతో ప్రజల మధ్య ఏలియన్ల గురించి మరోసారి చర్చ జరుగుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…