Categories: Featured

Flash Back : అప్పట్లో ఈ జంట యమ క్రేజ్.. 1983 లో వచ్చిన వీరి మూడు చిత్రాల్లో ఒకటి ప్రేక్షకులను నిరాశపరిచింది.

Flash Back : 1978 ప్రాణం ఖరీదు సినిమాతో ఈ జంట కలిసి వెండితెరపై మొదటిసారిగా కనిపించారు. అలా ప్రారంభమైన వీరి ఇద్దరి సినీ ప్రయాణం. అనేక విజయవంతమైన చిత్రాలలో ప్రేక్షకులను ఆనందపరిచారు. అలా 1983లో మూడు నెలల వ్యవధిలో వచ్చిన మూడు చిత్రాల్లో చిరంజీవి, మాధవి కలిసి నటించారు. ఆ మూడు చిత్రాలతో వెండితెరపై ప్రేక్షకులను ఏ విధంగా మెప్పించారో చూద్దాం.

1983, జూలై లో పిఎన్ఆర్ పిక్చర్స్, కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో ‘రోషగాడు’ చిత్రం విడుదల అయింది.ఈ సినిమాలో చిరంజీవి మాధవి హీరో,హీరోయిన్లుగా నటించారు.

కథలోకి వస్తే..
చిరంజీవి సికిందర్ శ్రీకాంత్ అనే రెండుపాత్రలు పోషించాడు సికిందర్ ఒక పెద్ద రౌడీ, నేరస్థుడు. వజ్రాలు, నగదు, ఆస్తులను స్మగ్లర్ల నుండి దొంగిలించి రహస్య ప్రదేశంలో (దుర్గా ఆలయం) దాస్తూంటాడు. ఒక రోజు స్మగ్లర్లు సికిందర్‌పై దాడి చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథాంశం.

1983 అక్టోబర్ 20న విజయసాయి పిక్చర్స్, కోడి రామకృష్ణ దర్శకత్వంలో “సింహపురి సింహం” చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో చిరంజీవి, మాధవి, రాధిక హీరో, హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి ఈ చిత్రంలో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. తండ్రిగా నటించిన చిరంజీవికి (రాజశేఖరం) భార్యగా రాధిక, సోదరునిగా గొల్లపూడి నటించారు. అలాగే కొడుకుగా నటించిన చిరంజీవి(విజయ్) ప్రియురాలిగా మాధవి నటించారు. చిరంజీవి కోడి రామకృష్ణ కాంబినేషన్లో నాల్గవ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.

ఖైదీ 1983లో విడుదలైన ఒక తెలుగు సినిమా. తొలి చిత్రంతోనే చిత్రసీమలో పేరు శాశ్వతం చేసుకున్న కొన్ని పతాకాలున్నాయి. అడవి రాముడు తీసిన సత్యచిత్ర, వేటగాడు తీసిన రోజా మూవీస్ ఆ కోవకు చెందినవే. ఖైదీ చిత్రంతో సంయుక్త మూవీస్ అటువంటి కీర్తి సంపాదించుకుంది. చిరంజీవి, కోదండ రామిరెడ్డి కాంబినేషన్ ఈ చిత్రంతోనే మొదలయ్యింది. చిరంజీవిని అగ్రనటునిగా, కోదండరామిరెడ్డిని గురువుకి తగ్గ శిష్యునిగా, పరుచూరి సోదరులు ను ప్రముఖ రచయితలుగా నిలిపిన చిత్రం.

చిత్ర సమర్పకుడు ఎం. తిరుపతి రెడ్డి, దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి చిరంజీవితో కలిసి సినిమా చేయాలని భావించారు. అమెరికన్ సినిమా ఫస్ట్ బ్లడ్ (1982) ఆధారంగా ఒక కథను డెవలప్ చేయమని తిరుపతి రెడ్డి పరుచూరి సోదరులను కోరారు. అలా వారు తయారు చేసిన కథతో వచ్చిన ఈ సినిమా 1983 అక్టోబర్ 28న విడుదలైంది.
ఈ విధంగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటించిన వీరి మూడు సినిమాల్లో.. ఖైదీ సినిమా ఇండస్ట్రీ హిట్ కాగా.. రోషగాడు విజయవంతమై సింహపురి సింహం పరాజయం పొందింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అమ్మ తిట్టిందని అర్ధరాత్రి 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిపోయిన బాలుడు..!

ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…

17 hours ago

చరణ్‌తో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయబోయేది ఎవరు? హాట్ టాపిక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…

17 hours ago

వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు… తండ్రిని గుర్తుచేసుకున్న జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…

17 hours ago

పవన్ కళ్యాణ్ ప్రేమకథ రివీల్… మొదట ప్రపోజ్ చేసినది ఎవరో క్లారిటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…

17 hours ago

వదినపై హన్సిక దుమారం… రూ.2 కోట్ల పరువునష్టం కేసు!

ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…

17 hours ago

మాథ్యూ పెర్రీ మృతి కేసులో సంచలన తీర్పు… ‘కెటమైన్ క్వీన్’కు 15 ఏళ్ల జైలు

హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…

17 hours ago