Flash Back : 1981లో ఎన్టీఆర్ నటించిన కొండవీటి సింహం, ఏఎన్ఆర్ నటించిన ప్రేమాభిషేకం, కృష్ణ నటించిన ‘ఊరికి మొనగాడు’, శోభన్ బాబు నటించిన ‘పండంటి జీవితం’ లాంటి పెద్ద హీరోల చిత్రాలే కాకుండా అప్పటికి చిన్న హీరోలైన చిరంజీవి, కార్తీక్, ప్రదీప్, గిరీష్ లాంటి హీరోల చిత్రాలు కూడా విజయాన్ని సాధించాయి.
‘న్యాయం కావాలి ‘ చిత్రం 1981లో ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాధిక హీరో హీరోయిన్లుగా నటించారు. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమాగా పేర్కొనవచ్చు. డి.రామేశ్వరి రాసిన కొత్త మలుపు అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో చిరంజీవి, రాధిక, జగ్గయ్య, మరియు శారద నటించారు. ఇది హిందీలో 1983లో ముఝే ఇన్సాఫ్ చాహియేగా పునర్నిర్మించబడింది.
“సీతాకోక చిలక ” 1981లో భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం.ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఏడిద నాగేశ్వర రా నిర్మించారు మరియు దాని తమిళ వెర్షన్‌తో పాటు అలైగల్ ఒయివతిల్లై అనే పేరుతో ఏకకాలంలో చిత్రీకరించబడింది. మురళి తమిళంలో కార్తీక్‌గా గుర్తింపు పొందారు. ముచ్చెర్ల అరుణ కథానాయికగా నటిస్తుండగా, రాధ తమిళ వెర్షన్‌లోనూ అదే పాత్రను పోషించింది. 1983లో జరిగిన 9వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోని ఇండియన్ పనోరమా విభాగంలో ఈ చిత్రం ప్రదర్శించబడింది. ఈ చిత్రం ఐదు నంది అవార్డులను గెలుచుకుంది.
‘ముద్ద మందారం’ జంధ్యాల దర్శకునిగా, ప్రదీప్, పూర్ణిమ ప్రధాన పాత్రల్లో 1981లో విడుదలైన ప్రేమకథాచిత్రం. రచయిత జంధ్యాల ఈ చిత్రంతో దర్శకులుగా మారారు. ప్రదీప్, పూర్ణిమలు తొలిసారిగా చిత్ర పరిశ్రమకు ఈ చిత్రంతో పరిచయమయ్యారు. చక్కటి సంగీతం (రమేష్ నాయుడు), సంభాషణలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన తప్పెటగుళ్ళ నృత్యం చిత్రంలో చూపబడింది. సినిమా మంచి విజయాన్ని సాధించింది.
సప్తపది, 1981లో విడుదలైన ఒక తెలుగు సినిమా.ఈ సినిమాలో సోమయాజులు, అల్లు రామలింగయ్య, సబిత, గిరీష్ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. ఇది నృత్యం ప్రధానాంశంగా వచ్చిన సినిమా. అంతకుముందు విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం అనే సంగీతప్రధాన చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమా మంచి అంచనాలతో విడుదలయ్యింది. 1981లో విడుదలైన ఈ చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…