Flash Back : “స్టూవర్టుపురం” టైటిల్ తో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ప్రదర్శింపబడ్డాయో తెలుసా.?!

Flash Back : స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ 1991 లో వచ్చిన తెలుగు యాక్షన్ చిత్రం. యండమూరి వీరేంద్రనాథ్ రచన, దర్శకత్వం వహించాడు. చిరంజీవి, విజయశాంతి, నిరోషా ప్రధాన పాత్రల్లో నటించారు. కె.ఎస్.రామారావు నిర్మించిన ఈ చిత్రంలో శరత్ కుమార్ ప్రధాన విలన్‌గా నటించాడు.
స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ దర్శకత్వం యండమూరి వీరేంద్రనాధ్, చిత్రానువాదం పరుచూరి సోదరులు, తారాగణం చిరంజీవి, నీరోష, విజయశాంతి సంగీతం ఇళయరాజా సంభాషణలు ఎం.వి.ఎస్.హరనాథరావు ఛాయాగ్రహణం లోక్ సింగ్.

Flash Back : "స్టూవర్టుపురం" టైటిల్ తో వచ్చిన ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలా ప్రదర్శింపబడ్డాయో తెలుసా.?!

ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ ( చిరంజీవి )ని స్టూవర్టుపురం పోలీస్ స్టేషనులో పోస్టు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్టూవర్ట్‌పురం, దోపిడీలు, దొంగతనాలు, రాజకీయ అవినీతితో అపఖ్యాతి పాలైన ప్రదేశం. గ్రామంలో పెద్ద ఎత్తున జరిగిన ఆభరణాల దోపిడీ రహస్యాన్ని ఛేదించే పని రాణా ప్రతాప్ కు కేటాయించారు. రాణా ప్రతాప్ ఈ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతాడు. నగల దోపిడీ వెనుక సూత్రధారి అయిన మాఫియా నాయకుడిని ( శరత్ కుమార్ ) పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ అంశం.

దర్శక, నిర్మాత సాగర్ 1986లో మావారి గోల సినిమా నిర్మించి అది ఘోర పరాజయం కావడంతో సినిమా నిర్మాణం నుంచి మూడేళ్ళపాటు దూరంగా ఉన్నారు. ఆయన మిత్రుడు జయసింహారెడ్డి – మొదటి రెండు సినిమాలు దర్శకునిగా యాక్షన్ జానర్ లో తీసి విజయం సాధించావు, ఇప్పుడు హాస్యాన్ని పట్టుకుని స్వీయనిర్మాణంలో తీయడం వల్ల నష్టపోయావు, మళ్ళీ దర్శకునిగా యాక్షన్ సినిమాలు తీయవచ్చు కదా అని సూచించారు.ఆయన మాటల స్ఫూర్తితోనే సాగర్ ఈ సినిమా రూపొందిచారు.

1991 రామిరెడ్డి, వీరారెడ్డి నిర్మాణం,సాగర్ దర్శకత్వంలో “స్టూవర్టుపురం దొంగలు” విడుదలైంది. ఈ సినిమాలో భానుచందర్, లిజీ హీరో, హీరోయిన్లుగా నటించారు. చరణ్ రాజ్ ఓ కీలక పాత్రలో కనిపించారు.
చిరంజీవి నటించిన స్టూవర్టుపురం పోలీసుస్టేషన్ సినిమా విడుదలైన కొన్నాళ్ళకే ఈ సినిమా విడుదలైంది. దాదాపు ఒకేలా ఉన్న టైటిల్స్ వల్ల ఈ సినిమాని జనం గుర్తుపట్టక ఇబ్బందులు పడతారేమోనని అనుకున్నారు.. కానీ సినిమాలో స్టోరీ టైటిల్ కు తగ్గట్టుగా ఉండడంతో.. స్టువర్టుపురం దొంగలు టైటిల్ ని ఖరారు చేశారు. అలా చిరంజీవి హీరోగా నటించిన “స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్” బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందగా..భానుచందర్ హీరోగా నటించిన “స్టూవర్టుపురం దొంగలు” విజయాన్ని సాధించింది.