Featured

Flash Back : ఆ ఏడాది చిరంజీవి, బాలయ్యలను నిరుత్సాహపరచిన ఆ రెండు చిత్రాలు.!

Flash Back : మెగాస్టార్ చిరంజీవి అప్పటివరకు జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తో ఉన్నారు. అలా స్వింగ్ లో ఉన్న చిరంజీవి ఆ సంవత్సరం కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో నటించారు.

ఆపద్బాంధవుడు, కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1992లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి, జంధ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
మాధవుడు (చిరంజీవి) ఒక పల్లెలో పశువుల కాపరి.ఒక ఉపాధ్యాయుడి (జంధ్యాల) ఇంటికి నమ్మకమైన తోడు.ఉపాధ్యాయుని కూతురు హేమ (మీనాక్షి శేషాద్రి)కి మాధవుడు మంచి దోస్తు. మాధవుడు పశువులను కాస్తుంటాడు.నాటకాలలో వేషాలు కూడా వేస్తుంటాడు.హేమ తండ్రి మంచి కవి, కానీ కవిత్వానికి ఆదరణ లేనందున ఆతని కవిత్వాన్ని ప్రచురించలేకపోతాడు. ఆ తర్వాత అనేక మలుపులు తిరిగి సినిమా ముగుస్తుంది.

అప్పటికి లారీడ్రైవర్, తల్లిదండ్రులు, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్ర విజయాలతో మంచి దూకుడుగా ఉన్న బాలకృష్ణ. ఈ సినిమాలో నటించారు. అశ్వమేధం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992 లో విడుదలైన చిత్రం. ఇందులో శోభన్ బాబు, బాలకృష్ణ, మీనా, నగ్మా, అమ్రిష్ పురి ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రానికి సత్యానంద్ కథ, మాటలు అదించగా, యండమూరి వీరేంద్రనాథ్ చిత్రానువాదం రాశాడు.

అశ్వమేధం సినిమా కథలోకి వెళితే.. అభిమన్యు ఒక నిజాయితీగల ఐ.పి.ఎస్ అధికారి. ఒక అంతర్జాతీయ నేరగాడైన వ్యాఘ్రను పట్టుకుంటాడు. కానీ అతను జైలునుంచి తప్పించుకుని పారిపోతాడు. అభిమన్యు తమ్ముడు కిరీటి ఒక పైలట్. అతని సహాయంతో వ్యాఘ్రను మట్టుపెడతాడు అభిమన్యు. కానీ అక్కడ చనిపోయింది కవలల్లో ఒకడైన అనిల్ వ్యాఘ్ర అనీ, అతని సోదరుడు సునీల్ వ్యాఘ్ర అనిల్ మరణానికి కారకులైన అభిమన్యు, కిరీటిల మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.
ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ అంశం… చిరంజీవి నటించిన “ఆపద్బాంధవుడు” పరాజయం పొందినప్పటికీ చిరంజీవికి నటునిగా మంచి గుర్తింపు వచ్చింది. అలాగే కే.రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన “అశ్వమేధం” మరోసారి రాఘవేంద్రరావు-బాలయ్య ఖాతాలో పరాజయాన్ని మూట కట్టుకున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

3 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

3 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

3 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

4 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

4 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

4 hours ago