మనలో చాలా మందికి గాలిలో మనకు నచ్చిన విధంగా ఎగిరితే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఒక చోటు నుంచి మరో చోటుకు ఎగరడం కష్టమైనప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. భవిష్యత్తులో మనం గాల్లో ఎగురుకుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తాజాగా ఒక వ్యక్తి బెడ్ పై గాలిలో విహరించాడు. అది కూడా పక్కనే అలారం పెట్టుకుని నచ్చిన విధంగా గాల్లో తేలుతూ ప్రయాణం చేశాడు.
ఒక వ్యక్తి ఏకంగా గాల్లో ఎగిరే బెడ్ రూమ్ ను తయారు చేశాడు. దర్జాగా ఎగిరే మంచంపై ప్రయాణించి ప్రపంచమంతా తనవైపు చూసేలా చేశాడు. టర్కీకి చెందిన హసన్ కావల్ మనం కలలా ఊహించే ప్రపంచాన్ని నిజం చేసి చూపించాడు. హసన్ గాల్లో ఎగిరిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు తమకు కూడా అలాంటి మంచం కావాలని కామెంట్లు పెడుతున్నారు.
మరి కొందరు ధనవంతులు అయితే అమ్మితే ఎంత డబ్బైనా చెల్లించి మంచాన్ని కొనుగోలు చేస్తామని వెల్లడించారు. గాల్లో ఎగిరిన ఫ్లైయింగ్ బెడ్ సముద్రం మీదుగా ప్రయాణించి బీచ్ లో ల్యాండ్ కావడం గమనార్హం. కళ్లకు స్లీప్ మాస్క్ పెట్టుకుని హసన్ ప్రయాణించిన తీరును చూస్తే ఎంతో అదృష్టం ఉంటే మాత్రమే అలా ప్రయాణించే అదృష్టం వస్తుందని అనిపిస్తుంది. ఆ తర్వాత బీచ్ లో హసన్ నిద్ర లేచాడు.
సాధారణంగా చనిపోయిన తరువాత ఎక్కువ పుణ్యాలు చేస్తే స్వర్గం చూస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే హసన్ మాత్రం భూమి మీద ఉండే స్వర్గం చూశాడు. నాలుగున్నర నిమిషాలు ఉన్న ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. భవిష్యత్తులో మనకు కూడా ఫ్లైయింగ్ బెడ్ రూమ్స్ అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…