24 క్యారెట్ల తులం బంగారం ధర త్వరలో రూ.2 లక్షల మార్క్‌ను దాటే అవకాశం ఉందన్న అంచనాలతో బంగారం మార్కెట్ ఒక్కసారిగా వేడెక్కింది. వ్యాపార విశ్లేషకుల అంచనాలే కాదు, అంతర్జాతీయ పరిణామాలు కూడా ఈ భావనకు బలం ఇస్తుండటంతో ప్రజలు ముందస్తు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పెట్టుబడిగా బంగారం కొనాలనుకునే వారి సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బేగంబజార్ ప్రాంతంలో బంగారం మార్కెట్‌లో సందడి నెలకొంది. దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కృష్ణ జ్యూవెల్లర్ మార్ట్ వద్ద హోల్‌సేల్ బంగారు కాయిన్లు, బిస్కెట్ల కోసం జనం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలబడి టోకెన్లు తీసుకుని మరీ కొనుగోళ్లు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తుండటం గమనార్హం.
బంగారం ధరలు పెరుగుతాయన్న అంచనాల వెనుక అంతర్జాతీయ కారణాలు కీలకంగా మారాయి. ప్రపంచ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ధరలపై ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా విధానాలపై ఉన్న అనిశ్చితి పెట్టుబడిదారులను సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లిస్తోంది.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించడం మార్కెట్లలో ఆందోళనకు దారితీసింది. అలాగే దక్షిణ కొరియా నుంచి దిగుమతి అయ్యే వాహనాలు, ఔషధాలపై అమెరికా 25 శాతం పన్నులు పెంచడం కూడా అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపింది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిని సురక్షిత ఆస్తులుగా భావిస్తూ పెట్టుబడిదారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు.
ఆసియా, యూరప్ దేశాలు ఇప్పటికే పెద్ద మొత్తాల్లో బంగారం కొనుగోలు చేస్తున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా విధానాల్లో స్పష్టత లేకపోవడం ఈ ఏడాది బంగారం ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశంగా మారిందని ఆగ్‌మాంట్ సంస్థ ప్రతినిధి రెనిషా చైనానీ వ్యాఖ్యానించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా చూస్తే, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అంచనాలే ప్రస్తుతం బంగారం మార్కెట్‌కు ప్రధాన ఊపునిస్తున్నాయి. దీంతో సాధారణ వినియోగదారుల నుంచి పెద్ద పెట్టుబడిదారుల వరకు అందరూ బంగారంపై దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…