పశ్చిమ బెంగాల్‌కు పదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ పేరు తెరపైకి ఎందుకు వచ్చిందంటే.. ఆమె మరదలు ఇరా బసు పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో యాచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఆమె పీహెచ్ డీ చేసి బెంగాలీ, ఇంగ్లీష్ లో స్పష్టంగా మాట్లాడుతుంది. ఆమె ఒక క్రీడాకారిణి కూడా. ఆమె టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఆడేవారు. 1976 సంవత్సరంలో ఆమె పాఠశాలలో టీచర్ గా కూడా పనిచేశారు. తర్వాత 2009 లో రిటైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఆమె గత కొన్నిసంవత్సరాల క్రితం కనిపించకుండా పోయింది.
ఇంట్లో వాళ్లు ఆచూకీ కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోనే ఫుట్ పాత్ లపై పడుకుంటూ యాచిస్తుంది. ఆమె పాఠశాలలో పని చేసింది. కానీ రావాల్సిన పెన్షన్ కు సంబంధించి ఎలాంటి దరఖాస్తు సమర్పించలేదని ఆమె పని చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపాడు.
దీనిపై ఆమెను అడుగగా.. టీచర్ గా తాను పని చేస్తున్న సమయంలో ఎవరిపై ఆధారపడాలని అనుకోలేదని.. అందుకనే బుద్ధదేవ్‌తో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. తన శ్రమతోనే బాతకాలని అనుకున్నాను.. అందుకనే ఇలా అయింది అంటూ చెప్పారు. ఇక ఆమె ఇలాంటి పరిస్థితిలో ఉందని సోషల్ మీడియాలో వైరల్ కాగా స్పందించిన అధికారులు ఆమెను కోల్ కత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…