మాజీ సీఎం బంధువు పరిస్థితి దయనీయం.. పాపం ఆమె ఎలా మారిందంటే…

0
257

పశ్చిమ బెంగాల్‌కు పదేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసిన బుద్ధదేవ్ భట్టాచార్య అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ పేరు తెరపైకి ఎందుకు వచ్చిందంటే.. ఆమె మరదలు ఇరా బసు పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో యాచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఆమె పీహెచ్ డీ చేసి బెంగాలీ, ఇంగ్లీష్ లో స్పష్టంగా మాట్లాడుతుంది. ఆమె ఒక క్రీడాకారిణి కూడా. ఆమె టేబుల్ టెన్నిస్, క్రికెట్ ఆడేవారు. 1976 సంవత్సరంలో ఆమె పాఠశాలలో టీచర్ గా కూడా పనిచేశారు. తర్వాత 2009 లో రిటైర్ అయ్యారు. ఇదిలా ఉండగా.. ఆమె గత కొన్నిసంవత్సరాల క్రితం కనిపించకుండా పోయింది.

ఇంట్లో వాళ్లు ఆచూకీ కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. ఆమె బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాల జిల్లాలోనే ఫుట్ పాత్ లపై పడుకుంటూ యాచిస్తుంది. ఆమె పాఠశాలలో పని చేసింది. కానీ రావాల్సిన పెన్షన్ కు సంబంధించి ఎలాంటి దరఖాస్తు సమర్పించలేదని ఆమె పని చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపాడు.

దీనిపై ఆమెను అడుగగా.. టీచర్ గా తాను పని చేస్తున్న సమయంలో ఎవరిపై ఆధారపడాలని అనుకోలేదని.. అందుకనే బుద్ధదేవ్‌తో ఉన్న బంధుత్వాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదని ఆమె చెప్పుకొచ్చింది. తన శ్రమతోనే బాతకాలని అనుకున్నాను.. అందుకనే ఇలా అయింది అంటూ చెప్పారు. ఇక ఆమె ఇలాంటి పరిస్థితిలో ఉందని సోషల్ మీడియాలో వైరల్ కాగా స్పందించిన అధికారులు ఆమెను కోల్ కత్తాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.