Categories: FeaturedMovie News

ఒకప్పుడు వ్యభిచారి… ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రైటర్ ! అద్భుతమైన జర్నీ…

ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించడం చాలా కష్టం. తాజాగా బాలీవుడ్లో ఒక రైటర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకప్పుడు ఆమె కనీసం తినడానికి తిండి కూడా లేకకేవలం డబ్బులు కోసం వ్యభిచారం చేసింది. కానీ ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్ గా చక్రం తిప్పుతుంది.

ఆమె మరెవరో కాదు షాగుఫ్తా రఫీక్. షాగుప్తా రఫీక్‌ పేరు సౌత్‌లో పెద్దగా తెలియక పోవచ్చు. కాని బాలీవుడ్ లో ఈమె పేరు గత 3 సంవత్సరాల నుండి మారు మ్రోగిపోతుంది. ఈమె రచయిత్రిగా ప్రస్తుతం బాలీవుడ్‌ లో టాప్‌ రేంజ్ లోనే ఉంది. హిందీలో ఈమె చేస్తున్న సినిమాల జాబితా చూస్తే బాబోయ్‌ అనాల్సిందే. ఈమె “ఆషికి 3” చిత్రానికి కథ అందించడంతో బెస్ట్ మూవీ రచయిత్రిగా స్టార్‌డమ్ ను దక్కించుకుంది. హిందీలో ప్రస్తుతం స్టార్‌ హీరోల సినిమాల కథా చర్చలకు కూడా షాగుప్తానే ఆహ్వానిస్తున్నారు. ఇంత మంచి గుర్తింపును దక్కించుకున్న రచయిత్రి షాగుప్తా రఫీక్‌ గతంలో ఒక సె క్స్‌ వర్కర్‌. బార్‌ డాన్సర్ అంటే నమ్మశక్యంగా లేదు కదూ..! కానీ మీరు నమ్మినా నమ్మక పోయినా ఇది నిజం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పుకొచ్చింది.

తాజాగా షాగుప్తా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను వివరించింది. నేటి వరకు ఆమె తల్లి దండ్రులు ఎవరో తెలియదు. ఓ మహిళ షాగుఫ్తాని దత్తత తీసుకుని పెంచుకుంది. ఆమె పెంపుడు తల్లి మరో వ్యక్తితో రిలేషన్ పెట్టుకోవడం.. అతడు ఆకస్మికంగా మరణించడంతో ఊహించని విధంగా కుటుంబ భారం అంతా షాగుప్తాపై పడింది. అటువంటి విపత్కర పరిస్థితిల్లో షాగుఫ్తా 16 ఏళ్ల వయసులోనే కుటుంబ పోషణ కోసం బార్ డాన్సర్ గా.. వ్యభిచారిణిగా మారింది. ఆ సమయంలో తప్పనిసరై కేవలం డబ్బు కోసం ఆమె వ్యభిచారం చేసింది. ప్రైవేట్ పార్టీలలో అంగాంగ ప్రదర్శన చేస్తూ డాన్స్ చేస్తుంటే తనపై డబ్బులు చల్లేవారని షాగుఫ్తా రఫీక్ ఆనాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంది. ఒక మహిళని సమాజంలో ఎంత హీనంగా చూస్తారనేది అప్పుడు తనకు అర్థమైంది అంటూ చెప్పుకొచ్చింది.

కాలగమనంలో తనకు రచనలపై ఉన్న ఆసక్తిని గమనించి అటువైపు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే బాలీవుడ్ బడా నిర్మాత మహేష్ భట్ ఆమెకు మొదటిసారిగా అవకాశం ఇచ్చాడు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ రోజు మోస్ట్ సక్సెస్ ఫుల్ రైటర్ అనిపించుకుంది షాగుఫ్తా. ఈమె రాసిన రాజ్, మర్డర్ 2, జిస్మ్ 2, ఆషిక్ 2 లాంటి రొమాంటిక్ సినిమాలు సక్సెస్ సాధించాయి. తెలుగులో సచిన్ జోషి హీరోగా వచ్చిన  “నీజతగా నేనుండాలి” అనే చిత్రానికి ఈమె కథ అందించింది.  మొత్తానికి ఎక్కడో మొదలై ఇప్పుడు ఎక్కడో ఉంది షాగుప్తా.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago