Gali Janardhan reddy : కర్ణాటక ప్రముఖ రాజకీయనాయకుడు, బళ్లారి కి చెందిన గాలి జనార్ధన్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. ధనవంతులైన రాజకీయనాయకులలో ఆయన ఒకరు. బళ్లారి సమీపంలోని ఐరన్ ఓర్ లో అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించారని మనీ ల్యాండరింగ్ కేసులు ఈయన మీద ఉన్నాయి. దీంతో చాలా ఏళ్ళు విచారణ కోసం జైల్లో ఉన్నారు. ఇక ఇపుడు బయటికి వచ్చినా రాజకీయాల్లో చురుగ్గా లేరు.
అనుకుంటే ఒక్కరోజైనా సీఎం గా ఉండగలను…
ఇక ఈ మధ్యనే గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి ని గ్రాండ్ గా సినిమా రంగ ప్రవేశం చేయించారు. ఇక వారాహి నిర్మాణ సంస్థ ద్వారా సినిమా నిర్మించబోతున్నారు. అయితే తాజాగా గాలి జనార్దన్ రెడ్డి చేసిన వాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. తన సోదరుడు సోమశేఖర్ రెడ్డి 57 వ పుట్టినరోజు వేడుకలను బళ్లారి లోని ఒక ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఎమ్మెల్యే పదవి మీద, ఎంపీ పదవి మీద మంత్రి పదవుల మీద ఆశలేదు.
డబ్బుకోసం ఏరోజు రెడ్డి బ్రదర్స్, శ్రీరాములు ఆశపడలేదు. నేను అనుకుంటే ఒక్కరోజు సీఎం ని అవ్వగలను, కానీ నాకు ఆశలేదు. నాపై కొంతమంది కుట్రచేసి నాకు ఇబ్బందులు కలిగించాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయాన్ని సిబిఐ అధికారులు స్వయంగా నాకు చెప్పారు. ఆ మాటలు చెప్పడంతో అక్కడున్న ఆయన అభిమానులు, బంధువులు గాలి జనార్ధన్ రెడ్డి పై పూల వర్షం కురిపించి తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…