Featured

Naresh& pavitra Lokesh : పెళ్లి గురించి ఓపెన్ అయిన నరేష్…. మానసిక క్షోభ భరించలేక మరో పెళ్లి ఆలోచన…!

Naresh : నరేష్, పవిత్ర లోకేష్ వీరిద్దరు ఇపుడు మీడియాలో హాట్ టాపిక్, వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ మీడియా కోడై కుస్తోంది. అయితే క్లారిటీ మాత్రం వీళ్లిదరూ ఇవ్వడం లేదు. అయితే పరోక్షంగా నరేష్ ఓపెన్ అయ్యారు. పెళ్లి గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక ఇపుడు నరేష్ చెప్పిన విషయాలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే మరో పెళ్లి గురించి ఆలోచిస్తారు…

ఇక రీసెంట్ గా ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ పెళ్లి గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్, మీరు ఇండస్ట్రీలో ఇలా ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు కదా అనే ప్రశ్న రాగా మరొకరి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు అలాగే మాట్లాడటం ఇష్టం లేదు. పెళ్లి అయ్యాక ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే మరో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తారు. ఒక ఆర్టిస్ట్ జీవితం చాలా కష్టతరంగా ఉంటుంది. సమయం అంటూ ఉండదు, ఒక ఉద్యోగికి ఖచ్చితంగా పని వేళలు ఉంటాయి కానీ ఒక నటుడికి అలాంటివి ఉండవు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని సాగే వాళ్ళు నాతో ఉంటారు, అలా ఉండని వాళ్ళు నాతో ఉండరు. సినిమాలంటే పిచ్చి సినిమా నే నా మొదటి పెళ్ళాం అంటూ కామెంట్స్ చేసారు, పరోక్షంగా తన మూడు పెళ్లిళ్ల ముచ్చట చెప్పారు.

సెలబ్రిటీలు ఎక్కువగా విడాకులు, మళ్ళీ పెళ్లిళ్ల వైపు వెళ్తున్నారు అనే ప్రశ్న రాగా.. సెలబ్రిటీలు కనిపిస్తారు కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో జరిగేవి కనిపిస్తాయి. బయట సాధారణ జనాలవి కనిపించవు అంతే అన్నారు. ఇప్పటి కాలానికి పెళ్లి వ్యవస్థ పనికిరాదు. ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసుకున్నా నెలకే విడాకుల కోసం వెళ్తున్నారు. ముఖ్యంగా పెళ్లి చేసుకున్న ఇద్దరూ సంపాదిస్తుండడం, ఎవరూ ఇంకొకరిపై ఆధారపడక పోవడం, సర్దుకుపోయే మనస్తత్వం లేకపోవడం, ఇద్దరూ సమానమే అంటూ ఎవరి స్వేచ్ఛ వారికి కావాలని భావిస్తారు. దీనివల్ల ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే త్వరగా వీడిపోవాలని అనుకుంటున్నారు. మనసుకు కష్టంగా ఉన్నా ఇప్పటి కాలానికి పెళ్లి వ్యవస్థ పనికిరాదు అంటూ కామెంట్స్ చేసారు. అలా పరోక్షంగా పవిత్ర లోకేష్ తో పెళ్లి చేసుకోబోతున్నట్లు హింట్ ఇచ్చేసారు నరేష్.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago