Movie News

Gangavva: ఒక కాల్ షీట్ కోసం గంగవ్వ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. భారీగా సంపాదిస్తున్న గంగవ్వ?

Gangavva: మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ పరిచయమయ్యారు గంగవ్వ. ఆరు పదుల వయసులో కూడా ఈమె తన బంధువుల సహాయంతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి పల్లెటూరి వాతావరణ కి సంబంధించిన అన్ని విషయాలను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరితో పంచుకున్నారు. ఇలా తన జీవనశైలి గురించి గంగవ్వ చేసే వీడియోలకు మంచి ఆదరణ వచ్చింది.

ఈ విధంగా రోజురోజుకు గంగవ్వ యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వారి సంఖ్య పెరగడంతో ఈమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారారు. ఇకపోతే గంగవ్వ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఈమెకు ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే అవకాశం కూడా వచ్చింది.ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వ తన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడమే కాకుండా ఒకవైపు యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటించే అవకాశాలను అందుకుంటున్నారు.

సాధారణంగా సినిమాలు షూటింగ్ జరిగే సమయంలో పెద్ద పెద్ద సెలబ్రిటీలకు మాత్రమే కేరవాన్ సదుపాయం ఉంటుంది. అయితే నిర్మాతలు గంగవ్వకు కూడా క్యారవాన్ సదుపాయం కల్పించారంటే ఈమెకు ఎలాంటి ఆదరణ ఉందో మనకు అర్థమవుతుంది. ఇకపోతే గంగవ్వ పలు సినిమా షూటింగులతో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

Gangavva: ఎందరికో స్ఫూర్తిగా గంగవ్వ..

ఈ విధంగా యూట్యూబ్ ఛానల్, సినిమాలతో గంగవ్వ ఏ స్థాయిలో సంపాదిస్తున్నారనే విషయంపై ప్రతి ఒక్కరిలోనూ ఆత్రుత ఏర్పడింది. అయితే గంగవ్వ సన్నిహితుల సమాచారం ప్రకారం ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందుతారని అలాగే సినిమా షూటింగులలో పాల్గొంటే ఒకరోజు కాల్ షీట్ కోసం గంగవ్వ 10,000 రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని తెలుస్తోంది. ఏది ఏమైనా గంగవ్వ ఈ వయసులో కూడా బాగా సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago