Garikapati Narasimharao : సామాజిక అంశాల మీద ప్రవచనాలు ఇచ్చే ప్రముఖ ప్రవచన కారుడు గరికపాటి నరసింహారావు గారు ఇటీవలే చిరంజీవి ఇష్యూలో బాగా వైరల్ అయ్యారు. బండారు దత్తాత్రేయ గారు ఏర్పాటూ చేసిన అలాయ్ బలయ్ కార్యక్రమంలో హాజరైనా గరికపాటి గారు కార్యక్రమానికి వచ్చిన చిరంజీవి గారితో అక్కడే ఉన్న జనాలు ఫోటోలు తీసుకుంటుండగా ఒకింత అసహనానికి గురై మీరు ఆ ఫోటో షూట్ ఆపి వస్తారా నన్ను ప్రవచనాలు ఆపి వెళ్ళిపోంటారా అంటూ మాట్లాడాడు. దీంతో మెగాస్టార్ అభిమానులు గరికపాటిగారిని బాగా ట్రోల్స్ చేసారు. ఇప్పుడిప్పుడే ఆ ఇష్యూ సద్దుమనిగింది అనుకునే లోపే గరికపాటి గారు మరో వివాదంలోకి ఇరుక్కున్నారు.
మహిళల వస్త్ర దారణ గురించి కామెంట్స్… అగ్రహిస్తున్న మహిళా సంఘాలు…
నిత్యం ఎన్నో అంశాల మీద ప్రవచనాలు చెప్పే గరికపాటి గారు ప్రస్తుత సమాజ పోకడల గురించి వ్యంగ్యంగా మాట్లాడుతూ వాటి పర్యవసానం కూడా వివరిస్తూ ఉంటారు. అలానే మహిళల వస్త్ర దారణ గురించి మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ విషయం మహిళా సంఘాల అగ్రహానికి గురిచేసింది. ఆడవాళ్లు చీర కట్టుకోవాలి, ఉద్యోగం కోసం బయటికి వెళితే అక్కడ మగవాళ్ళను రాసుకు పూసుకు తిరిగితే మగవాళ్లు ఏమవ్వాలి అంటూ కామెంట్స్ చేసారు.
ఇక ఈ కామెంట్స్ గురించి మహిళా సంఘ నాయకురాళ్లు మాట్లాడుతూ అంటే ఆడవాళ్ళు ఎలా కనిపిస్తున్నారు అంటూ అభిప్రాయపడ్డారు. ఆడవాళ్లు వంటింటి కుందేళ్ళలాగా ఉండాలా చీరలో ఎక్కడ ఏమి కనిపించాలో అవి కనిపిస్తాయి చీర కట్టుకోండి అని మాట్లాడుతున్నారు గరికపాటి ఆయన వయసు ఏమిటి ఆ మాటలు ఏమిటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆడవాళ్ల వస్త్రధారణ ఎలా ఉంటే ఆయనకు ఎందుకు అంటూ అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…