Movie News

Jeevitha Rajashekar: సొంత మామని దారుణంగా మోసం చేసిన జీవిత.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన గరుడవేగ ప్రొడ్యూసర్!

Jeevitha Rajashekar: జీవిత రాజశేఖర్ నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా నిత్యం ఏదో ఒక వివాదాస్పద వార్తల ద్వారా జీవిత సంచలనం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం వరకు గరుడవేగ సినిమా సమయంలో తనని దారుణంగా మోసం చేశారంటూ నిర్మాత కోటేశ్వర రాజు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే జీవిత ఈ విషయంపై స్పందిస్తూ తాను ఎవరినీ మోసం చేయలేదని ఆధారాలు లేకుండా తన గురించి మాట్లాడటం సరి కాదంటూ ఈ విషయం గురించి చెప్పుకొచ్చారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న గరుడవేగా నిర్మాత కోటేశ్వర రాజు దంపతులు జీవిత గురించి, ఆమె మోసాల గురించి బయటపెట్టారు. జీవిత రాజశేఖర్ స్వయంగా తన మామ వరదరాజన్ ను దారుణంగా మోసం చేశారని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.

ఎన్నో వ్యాపారాలు చేస్తున్న మేము ఆగమనం సినిమా చేస్తున్న సమయంలో రాజశేఖర్ తండ్రి వరదరాజన్ సినిమా ఫంక్షన్ కోసం వచ్చారని ఆ సమయంలో రాజశేఖర్ తో సినిమా చేయాలని అడగడంతోనే మేము ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చామని తెలిపారు. ఇక జీవిత సినిమా టాలెంట్ తో గరుడవేగ సినిమా ఎంత బడ్జెట్ లో పూర్తవుతుందో తనకు తెలుసు. ఈ సినిమా సుమారు 12 నుంచి 15 కోట్ల బడ్జెట్ తో పూర్తవుతుంది.

ఈ విషయం తన మామయ్య దగ్గర చెప్తే ఈ సినిమా చేయకుండా తననీ ఎక్కడ అడ్డుకుంటారో అని జీవిత తన మామయ్య ను మోసం చేస్తూ ఈ సినిమా కేవలం 5 కోట్లలో మాత్రమే పూర్తవుతుందని అబద్ధాలు చెప్పి తనని దారుణంగా మోసం చేశారు. నేను కూడా ఇదే ప్రశ్న అడిగితే మనకు ఇండస్ట్రీలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో పూర్తవుతుందని చెప్పి సినిమా ప్రారంభించారు.

దారుణంగా మోసం చేసిన జీవిత..


ఈ విధంగా జీవిత 75 శాతం పెట్టుబడి పెడితే తాను 25 శాతం పెట్టుబడి పెట్టేలా అగ్రిమెంట్ కుదుర్చుకున్నాము. అయితే సినిమా స్టార్ట్ అయిన తర్వాత జీవితం ఒక్క రూపాయి కూడా పెట్టకుండా తనతోనే ఖర్చు పెట్టించారని విషయం తెలిసి మధ్యలో మేము సినిమా నుంచి తప్పకున్నామని చివరికి జీవిత మమ్మల్ని బతిమాలితే తన ఆస్తులను మా దగ్గర తాకట్టు పెట్టుకుని సినిమా కోసం సుమారు 26 కోట్లు ఇచ్చామని తెలిపారు.అయితే తమ దగ్గర తాకట్టు పెట్టిన ఆస్తులను తమకు తెలియకుండా మరొకరు పేరు పై రాసి జీవిత దారుణంగా మోసం చేశారని ఈ సందర్భంగా గరుడవేగ ప్రొడ్యూసర్ కోటేశ్వర రాజ్ జీవిత గురించి షాకింగ్ కామెంట్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago