Featured

గ్యాస్ సిలిండర్లపై 500 రూపాయల క్యాష్ బ్యాక్.. ఎలా పొందాలంటే..?

గ్యాస్ కంపెనీలు రెండు రోజుల క్రితం సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తూ గ్యాస్ సిలిండర్ కంపెనీలు కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ అమెజాన్ పే ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

అమెజాన్ లో పే బిల్స్ అనే ఆప్షన్ ను ఎంచుకుని గ్యాస్ సిలిండర్ ను బుల్ చేసుకుంటే 50 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడం సాధ్యమవుతుంది. అయితే అందరూ ఈ ఆఫర్ ను పొందలేరు. తొలిసారి అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత పొందగలుగుతారు.

ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థలలో ఒకటైన పేటీఎం సైతం కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే ఏకంగా 500 రూపాయలు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. పేటీఎం యాప్ ను ఓపెన్ చేసి రీచార్జ్ అండ్ పే బిల్స్ ఆప్షన్ ను ఎంచుకుని గ్యాస్ సిలిండర్ ను సులువుగా బుక్ చేసుకోవచ్చు.

పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారు “firstlpg” అనే ప్రోమో కోడ్ ను వాడితే మాత్రమే ఈ ఆఫర్ ను పొందడానికి అర్హులవుతారు. ప్రోమో కోడ్ ను వాడకపోతే ఈ ఆఫర్ ను పొందడం సాధ్యం కాదు. ఈ నెల చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago