గ్యాస్ కంపెనీలు రెండు రోజుల క్రితం సబ్సిడీ గ్యాస్ సిలిండర్లపై ఏకంగా 50 రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. అయితే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ఆన్ లైన్ లో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అదిరిపోయే క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తూ గ్యాస్ సిలిండర్ కంపెనీలు కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటైన అమెజాన్ అమెజాన్ పే ద్వారా సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

అమెజాన్ లో పే బిల్స్ అనే ఆప్షన్ ను ఎంచుకుని గ్యాస్ సిలిండర్ ను బుల్ చేసుకుంటే 50 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ను పొందవచ్చు. రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఎల్‌పీజీ ఐడీ ఎంటర్ చేయడం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోవడం సాధ్యమవుతుంది. అయితే అందరూ ఈ ఆఫర్ ను పొందలేరు. తొలిసారి అమెజాన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకున్న వారు మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత పొందగలుగుతారు.
ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థలలో ఒకటైన పేటీఎం సైతం కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకుంటే ఏకంగా 500 రూపాయలు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. పేటీఎం యాప్ ను ఓపెన్ చేసి రీచార్జ్ అండ్ పే బిల్స్ ఆప్షన్ ను ఎంచుకుని గ్యాస్ సిలిండర్ ను సులువుగా బుక్ చేసుకోవచ్చు.
పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వారు “firstlpg” అనే ప్రోమో కోడ్ ను వాడితే మాత్రమే ఈ ఆఫర్ ను పొందడానికి అర్హులవుతారు. ప్రోమో కోడ్ ను వాడకపోతే ఈ ఆఫర్ ను పొందడం సాధ్యం కాదు. ఈ నెల చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.




























