Geetha krishna : అల్లూరి జయతోత్సవాలు భీమవరంలో ఘనంగా జరిగాయి. అల్లూరి కాంస్య విగ్రహాన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఇక ఈ వేడుకలో దేశ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, పర్యాటక శాఖ మంత్రి రోజా పాల్గొన్నారు. బీజేపీ తో సఖ్యతగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఈ వేడుకకు పిలవ పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈవిషయం పై తన మార్కు స్పందన తెలియజేసాడు గీతా కృష్ణ.
అన్నదమ్ముల మధ్య కాపు చిచ్చు…
పవన్ కళ్యాణ్ ను వేడుకకు పిలవకుండా కేవలం చిరంజీవిని పిలవడం జగన్ వ్యూహమని భీమవరం ప్రాంతంలో కాపులు, రాజులదే హవా. అందుకే జగన్ తెలివిగా చిరంజీవిని పిలిచాడు. కానీ ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని, సీఎం మాట్లాడారు కానీ చిరంజీవి మాట్లాడలేదు. కాపుల ఓట్లు చీల్చేందుకు జగన్ ఇలా చేసారని గీతా కృష్ణ అభిప్రాయపడ్డారు. చిరంజీవిని సోదరుడు అని సంభోదించడం కూడా అందులో భాగమే అన్నట్లు ఆయన చెప్పారు.
ఇక జగన్ బీజేపీ తో సన్నిహితంగా ఉన్నాడని తెలిపారు. ఇక చిరు వైసీపీ, లేదా బీజేపీ పార్టీ లోకి చేరే అవకాశాలను చెప్పాడు గీతాకృష్ణ. చిరు రాజకీయం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపినప్పుడే అయిపోయింది. ఇక ఇపుడు తమ్ముడికి విరుద్ధంగా వైసీపీ లోకి చేరకపోవచ్చు కానీ బీజేపీ లోకి ఒకవేళ ఆహ్వానిస్తే వెళ్లే అవకాశం లేకపోలేదు అంటూ చెప్పారు. కానీ ఏం జరిగినా ఈసారి కూడా జగన్ సీఎం అవుతాడు అంటూ జోష్యం చెప్పాడు గీతాకృష్ణ.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…