Categories: FeaturedMovie News

Kirrak RP: సుధీర్, రష్మీల మధ్య అఫైర్ అంతా అబద్దం… జబర్దస్త్ లో అవమానాన్ని తట్టుకోలేక సుధీర్ బయటకు వచ్చేసాడు : కిర్రాక్ ఆర్పి

Kirrak RP : ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ వేదిక ఎంతోమందికి గుర్తింపుని, జీవితాన్ని ఇచ్చింది. ఎంతోమంది కొత్తవాళ్లకు కమెడియన్స్ గా గుర్తింపునిచ్చి వాళ్ళ జీవితాలను మార్చేసింది. అలాంటి జబర్దస్త్ లో ఏం జరుగుతోందో పైకి అసలైన కారణాలు తెలియక పోయినా ఒక్కొక్కరు జబర్దస్త్ ను వీడి బయటికి వస్తున్నారు. నాగబాబు తో మొదలైన ఈ పరంపర ఇప్పుడు అనసూయ, సుధీర్ వరకు కొనసాగుతోంది.

మల్లెమాల వాళ్ళు సరిగా తిండి పెట్టరు.. అవమానించారు…

ఇక నాగబాబుతో పాటు బయటికి వచ్చిన కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ నుండి అందరూ ఎందుకు బయటికి వెళ్లిపోతున్నారో చెప్పారు. జబర్దస్త్ లో కంటెస్టెంట్స్ కి సరిగా తిండి పెట్టరు, మర్యాద ఇవ్వరు అంటూ చెప్పారు. సుధీర్ వళ్ళ చాలా ఈవెంట్లు హిట్ అయ్యాయి. కానీ సుధీర్ కి అక్కడ గౌరవం ఉండదు. ఎవరు.. ఆ మ్యాజిక్కులు చేస్తూ పావురాలు ఎగరేసుకునే వాడా అన్నట్లు మాట్లాడటం చాలా సార్లు విన్నాను. ఇక సుధీర్ తన వ్యక్తిగత జీవితాన్ని తాకట్టు పెట్టి స్కిట్లను హిట్ చేసాడు, రష్మీ తో అఫైర్ కూడా అలాంటిదే.

వాళ్ళ మధ్య ఏం లేదు కేవలం రేటింగ్స్ కోసం అలా క్రియేట్ చేసారు. ఇక సుధీర్ వుమనైజర్ అన్నట్లు పంచులు వేయడం కూడా అందుకే, కానీ స్కిట్ల కోసం రేటింగ్స్ కోసం సుధీర్ వాటిని భరించాడు. కానీ మర్యాద మాత్రం దొరకలేదు. పంచ్ ప్రసాద్ కి డయాలసిస్ సమస్య వచ్చినపుడు నాగబాబు గారే చొరవ చూపించి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి డబ్బు సర్దుబాటు చేసారు. శ్యామ్ ప్రసాద్ గారు పట్టించుకోలేదు అంటూ జబర్దస్త్ గురించి ఘాటు కామెంట్స్ చేసాడు కిర్రాక్ ఆర్పి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago