Categories: FeaturedMovie News

Madhavan : గజినీ సినిమా ఆఫర్ నాకే వచ్చింది కథ నచ్చక వదిలేసా.. వైరల్ అవుతున్న మాధవన్ కామెంట్స్..

Madhavan : టీవీ సీరియల్స్, చిన్న చిన్న పాత్రల ద్వారా తన కెరీర్ ని ప్రారంభించిన మాధవన్ 2000 సంవత్సరంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అలై పాయుదే’ సినిమా తన కెరీర్లో పెద్ద మలుపు అని చెప్పుకోవచ్చు. కెరీర్ మొదట్లోనే రొమాంటిక్ హీరోగా పేరుతెచ్చుకున్న మాధవన్, 2002 లో లింగస్వామి దర్శకత్వంలో ‘రన్’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నారు. అప్పట్లో తెలుగులో కూడా అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలిగాడు. దాదాపుగా 7 భాషల సినిమాల్లో నటించిన అతితక్కువ భారతీయ నటుల్లో మాధవన్ కూడా ఒకరు.

తాజాగా మాధవన్ నటించి, తానే స్వయంగా తెరకెక్కించిన ‘రాకెట్రీ’ మూవీ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు మాధవన్. ఆక్రమంలోనే హీరో సూర్య తో వీడియో చిట్ చాట్ లో పాల్గొన్నాడు. చాలా సేపు మాట్లాడుకున్న వీరిద్దరూ ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు.

మిమ్మల్ని చూసాకే నన్ను నేను ప్రశ్నించ్చుకోవడం మొదలు పెట్టాను…

వీడియో చిట్ చాట్ లో మాట్లాడేటప్పుడు మాధవన్ గజినీ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. గజిని మూవీ ఆఫర్ మొదటగా మురుగదాస్ సర్ తనకే చెప్పాడని, అయితే సెకండ్ ఆఫ్ లో కథ నచ్చక నో చెప్పానని చెప్పాడు. ఆ సినిమా చివరికి నీ దగ్గరికి వచ్చింది. అంతకుముందు మిమ్మల్ని నేను ‘కాఖా కాఖా’ సినిమాలో చూశాను. తరువాత గజినిలో మిమ్మల్ని చూశాక ఆ సినిమా సరైన వ్యక్తి దగ్గరికి వెళ్లిందని అనిపించింది. ఆ విషయాన్ని మీరు కూడా నిరూపించారు, అని సూర్య తో చెప్పారు.

గజినీ సినిమాలోని సిక్స్ ప్యాక్ వెనుక మీరు పడ్డ కష్టాన్ని నేను చూసాను. ఒక వారం పాటు ఉప్పు లేని ఆహారం తీసువడం చూసి నేను ఇలా చేయగలనా అని ఆశ్చర్యం వేసింది. మీరు కష్టపడ్డ తీరు నాలో ఆసక్తిని పెంచింది. అప్పటినుండే నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాను. అప్పటినుండే మీదగ్గర సలహాలు తీసుకోవడం కూడా ప్రారంభించాను. ఇండస్ట్రీలో నాకు పెద్ద స్నేహితులు ఎవరూలేరు, మిమ్మల్ని జ్యోతికను కలిసిన తర్వాత స్నేహం గురించి తెలుసుకున్నాను. ఈ వయసులో స్నేహం పొందడం చాలా కష్టం, కానీ నాకెప్పుడూ ఏ అవసరం వచ్చినా అపుడు మీరుంటారు… అంటూ సూర్యతో భావోద్వేగానికి లోనయ్యారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago