Geetha Krishna about Samantha : కాఫీ విత్ కరణ్ షో లో సమంత పాల్గొని తాను చేసిన కామెంట్స్ బాగా ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. విడాకుల గురించి, హీరోల గురించి, నెపోటిజం గురించి కామెంట్స్ చేసింది. ఇక ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇక తన విడాకుల గురించి మాట్లాడుతూ నాగచైతన్యను తనను ఒక గదిలో ఉంచితే పదునైన వస్తువులను ఉంచకూడదు అంటూ చేసిన వాఖ్యల వల్ల చైతూ అంటే సమంత కి ఎంత కోపం ఉందో చెప్పకనే చెప్పింది.
డబ్బు కోసమే ఇదంతా…
ఇక ఈ విషయాలపై గీతా కృష్ణ తనదైన శైలిలో స్పందించారు. సమంత స్వాతహాగా పైకి వచ్చిన అమ్మాయి అందుకే తాను పెళ్లి ఇలాంటి వాటిలో ఇమడలేదని ఎప్పుడో చెప్పాను. తనకు ఫ్యూచర్ చాలా ఉందని అర్థమైంది కాబట్టే పెళ్లి నుండి బయటికి వచ్చేసింది. తనకు తాను బ్రాండు సృష్టించుకొని ఇప్పుడు బాలీవుడ్ లోకి వెళ్లాలని అనుకుంటోంది. దానికి తగ్గట్టుగానే కాఫీ విత్ కరణ్ షోలో మాట్లాడింది. నాగ చైతన్య తో విడాకులు సామరస్యంగా జరగలేదని, అయితే తన నుండి భరణం లాంటిది విడాకుల తరువాత తీసుకోలేదని పరోక్షంగా చెప్పింది.
హీరోలందరి గురించి చెప్పింది కానీ నాగ చైతన్య గురించి మాత్రం అసలు చెప్పలేదు. ఈ విషయాలను గమనిస్తే తాను ఇప్పుడు ఏలాంటి కండిషన్స్ లేకుండా ఫ్రీగా ఉన్నానని చెప్పడమే అని ఆయన అన్నారు. సౌత్ లో చాలా రెస్ట్రిక్షన్స్ హీరోయిన్స్ కి ఉంటాయి. ఏదో వాళ్ళ సొంత కోడలు కొడుకు అన్నట్లుగా పెద్ద ఇంటి హీరో భార్యను చూస్తారు. వాటన్నింటి నుండి ఇపుడు సమంత ఫ్రీ అయింది. హిందీ లో ఇలాంటి ఆలోచన ధోరణి ఉండదు. దీపిక ‘గెహ్రాయియా’ వంటి సినిమా చేసినా భర్త రన్ వీర్ సింగ్ తోనే అలాంటి సినిమా చేయాలని ఎవరు అనలేదు అంటూ గీతా కృష్ణ ఉదహరించారు. ఇక సమంత తనకంటూ బ్రాండు తో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు అందుకే డబ్బు సంపాదన మీద ఉందని చెప్పింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…