Geeta Madhuri: గీతా మాధురి ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు ఇండస్ట్రీలో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ పాపులారిటీ ఉంది. గాయనిగా ఎన్నో ప్రత్యేక పాటలు పాడుతూ ఎన్నో అవార్డులు అందుకున్న గీత మాధురి నటుడు నందుని ప్రేమ వివాహం చేసుకొని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా కొందరు మోసగాళ్లు నటి గీతామాధురి పేరు పై ఫేక్ అకౌంట్స్ సృష్టించి ఆమె ఫోటోలను ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకుని వాట్సప్ చాటింగ్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారని గీత మాధురి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అమెరికా ఫోన్ నెంబర్ తో కొంతమంది మోసగాళ్లు తన పేరును ఉపయోగించి చాటింగ్ చేయడమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోయిన్ల ఫోన్ నెంబర్లు కూడా అడుగుతున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే అభిమానులు ప్రతి ఒక్కరి ఈ విషయాన్ని గమనించాలి అంటూ ఈమె తన అభిమానులను అలర్ట్ చేశారు.ఈ క్రమంలోనే నా ఫోటోతో లేదా నా పేరుపై ఎవరు మెసేజ్ చేసి ఫోన్ నెంబర్లు అడిగిన ఎవరు ఇవ్వకండి అంటూ అభిమానులకు సూచించారు. ఇలా గతంలో ఎన్నోసార్లు మోసగాళ్లు పలువురు ప్రముఖుల సెలబ్రిటీ పేర్లపై ఫేక్ అకౌంటు సృష్టించి మోసాలకు పాల్పడ్డారు.
ఈ క్రమంలోనే గీతా మాధురి పేరును కూడా ఉపయోగించి ఇలాంటి మోసాలకు పాల్పడటంతో ఈమె రంగంలోకి దిగి అసలు విషయం బయటపెట్టారు. ఇక ఈ విషయంపై గీతామాధురి పోలీసులకు ఫిర్యాదు చేసే సూచనలు కూడా కనపడుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన గీతామాధురి వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎవరు మోసపోకూడదని తన అభిమానులకు ఈ విషయాన్ని చేరవేశారు. ప్రస్తుతం గీత మాధురి చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…