Geetha Singh:గీతా సింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో నటిస్తూ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అల్లరి నరేష్ హీరోగా తెరికెక్కిన కితకితలు సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమాలో తన నటన ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా కితకితలు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గీతా సింగ్ అనంతరం పలు సినిమాలలో కమెడియన్ గా నటించారు.
ఇలా కమెడియన్ గా ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటించినటువంటి గీత సింగ్ ఈ మధ్యకాలంలో పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.ఇండస్ట్రీలో ఇప్పటికీ మగవారి డామినేషన్ ఎక్కువగానే ఉందని అందుకే తమలాంటి వారికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేవని ఈమె ఆవేదన చెందారు.
ఒకానొక సమయంలో తనకు మంచి అవకాశాలు వచ్చి కెరియర్ హ్యాపీగా కొనసాగుతుంది అనుకునే సమయంలోనే తనకు అవకాశాలు రావడం తగ్గిపోయాయని, ఇలా అవకాశాలు లేకపోవడం వల్ల తాను ఇండస్ట్రీకి దూరమయ్యానని వెల్లడించారు. ఇకపోతే ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో తనని చూసి చాలామంది అవమానించారు అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా హీరోయిన్స్ ఇద్దరు తనని చూసి ఈమె హీరోయిన్ ఏంటి అంటూ నా పట్ల చాలా అవమానకరంగా మాట్లాడారంటూ ఈమె బాధపడ్డారు.
ఇలా ఆ హీరోయిన్స్ ఇద్దరు తనని అవమానకరంగా మాట్లాడుతున్న సమయంలో అదే సినిమాలో హీరోగా నటించినటువంటి అల్లరి నరేష్ వారి వద్దకు వెళ్లి ఈమె నా ఫస్ట్ హీరోయిన్ అంటూ చెప్పడంతో వారిద్దరు షాక్ అయి అప్పటినుంచి తనని మేడం అంటూ పిలవడం మొదలుపెట్టారని ఈ సందర్భంగా గీతా సింగ్ తనకు జరిగిన అవమానం గురించి వెల్లడించారు.ఆరోజు ఆ హీరోయిన్స్ అవమానిస్తుంటే అల్లరి నరేష్ తన పరువు కాపాడారని ఈ సందర్భంగా గీత సింగ్ తనుకు జరిగినటువంటి చేదు అనుభవం గురించి వెల్లడించారు.
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన రాజశేఖర్ తన కెరీర్‌లో కొత్త దశను ఆత్మవిశ్వాసంతో ముందుకు…
గ్రహాల సంచారం మనిషి జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. ముఖ్యంగా ప్రేమ, వివాహం, సౌఖ్యం వంటి అంశాలకు…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా పేరొందిన నయనతార – విఘ్నేష్ శివన్ తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంను…
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, విస్తీర్ణం పరంగా అగ్రగామిగా నిలిచిన క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. ‘భూలోక వైకుంఠం’గా…
మన రోజువారీ సంభాషణల్లో “పెద్ద కళ్లు”, “చిన్న కళ్లు” అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. రూపురేఖల పరంగా ఇది ఒక…
పుట్టుమచ్చలు అంటే సాధారణంగా శరీరంపై కనిపించే చిన్న గుర్తులు మాత్రమే అని చాలామంది భావిస్తారు. అయితే భారతీయ సంప్రదాయాల్లో, ముఖ్యంగా…