Allu Aravind: నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి అను ఇమ్మానుయేల్. ఈమె తెలుగులో పలువురు యంగ్ హీరోల సరసన నటించే సందడి చేశారు. అయితే తాజాగా ఈమె అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ద్వారా ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.
లవ్ అండ్ రొమాంటిక్ చిత్రంగా ఈ సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 4వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి అను ఇమ్మానుయేల్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను అల్లు శిరీష్ తో సినిమా చేస్తున్న సమయంలో మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
మొదట్లో నేను కూడా నా గురించి ఇలాంటి వార్తలు రావడంతో చాలా బాధపడ్డాను అయితే ఇవన్నీ కూడా మామూలేనని అలవాటైపోయింది కానీ అల్లు శిరీష్ తో నాకు ఇదివరకు పరిచయం లేదు అల్లు ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉన్నప్పటికీ అల్లు శిరీష్ ని మాత్రం ఈ సినిమా పూజా కార్యక్రమాలలో కలిశానని అనంతరం ఒక కాఫీ షాప్ లో కూర్చుని సినిమా గురించి చర్చించుకున్నామని తెలిపారు.ఇలా మేమిద్దరం కాఫీ షాప్ లో కలిసి ఉండటం చూసి మా ఇద్దరి గురించి డేటింగ్ వార్తలను సృష్టించారంటూ ఈమె వెల్లడించారు.
ఈ విధంగా మేమిద్దరం డేటింగ్ లో ఉన్నామంటూ వార్తలు రావడంతో అల్లు అరవింద్ గారు డైరెక్ట్ గా నా కొడుకుతో డేటింగ్ లో ఉన్నావా అంటూ తనని ప్రశ్నించారని ఈ సందర్భంగా నటి అను ఇమ్మానుయేల్ వెల్లడించారు.అనంతరం ఈ గాసిప్ గురించి ఇద్దరం ఎంతోసేపు నవ్వుకున్నామంటూ ఈ సందర్భంగా ఆమె తన గురించి అల్లు శిరీష్ గురించి వచ్చినటువంటి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…