Geetha Singh: తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కితకితలు సినిమా ద్వారా అల్లరి నరేష్ పక్కన హీరోయిన్గా నటించిన సందడి చేసిన ఈమె ఈ సినిమాతో ఎంతో పాపులర్ అయ్యారు. ఈ సినిమా తర్వాత పలు సినిమాలలో గీత సింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా నటించారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏకంగా 32 సినిమాలలో నటించి మెప్పించారు. అయితే ప్రస్తుతం ఈమెకు సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నటువంటి ఈమె ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు.ఇలా పెళ్లి చేసుకోకపోయినప్పటికీ తన అన్నయ్య మరణించడంతో తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులను గీతా సింగ్ చూసుకుంటున్నారు.
ఈ విధంగా గీత సింగ్ పిల్లల బాగోగులను చూసుకుంటూ జీవితంలో ముందుకు కొనసాగుతున్నారు. అయితే తాజాగా తన దత్తపుత్రుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఒక్కసారిగా ఈమె ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి.ఇలా గీత సింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ఈ క్రమంలోనే కరాటే కళ్యాణి ఫేస్ బుక్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ పిల్లలు దయచేసి కారులో అయినా లేదా బైక్ పై అయినా జాగ్రత్తగా వెళ్ళండి.కమెడియన్ గీత సింగ్ అబ్బాయి రోడ్డు ప్రమాదంలో మరణించారు ఓం శాంతి అంటూ ఈమె ఈ విషయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసినటువంటి ఎంతో మంది నేటిజన్స్ గీత సింగ్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…