Gangavva: గంగవ్వ పరిచయం అవసరం లేని పేరు మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయినటువంటి గంగవ్వకు చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు అభిమానులుగా మారిపోయారు. ఇలా తరచూ యూట్యూబ్ ఛానల్ ద్వారా పల్లెటూరికు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేస్తుండే గంగవ్వ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. దీంతో ఈమెకు ఏకంగా సెలబ్రిటీ హోదా లభించింది.
ఇలా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వకు ఏకంగా బిగ్ బాస్ అవకాశం కూడా వచ్చింది. ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ప్రస్తుతం సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు.ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏకంగా సెలబ్రిటీగా మారిన గంగవ్వ నిత్యం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అందరితో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన టీం తో కలిసి విమానంలో ప్రయాణించినట్టు తెలుస్తోంది ఇలా తన విమాన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎక్కడికి వెళ్తున్నామో కనుక్కోండి అంటూ హింట్ ఇచ్చారు. ఇలా గంగవ్వ తన 62 సంవత్సరాల వయసులో ఎందరికో ఆదర్శంగా నిలిచి ఎంతో ఎత్తుకు ఎదిగిన గంగవ్వ తన జీవితంలో మొదటిసారి ఇలా విమానంలో ప్రయాణం చేస్తున్నందుకు ఎంతో సంతోషించారు. ఇలా తన విమాన ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
గంగవ్వ విమానంలో ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళింది అనే విషయానికి వస్తే ఈషా ఫౌండేషన్ సద్గురు ఆధ్వర్యంలో నిర్వహించే శివరాత్రి వేడుకలలో భాగంగా ఈ వేడుకలలో పాల్గొనడం కోసం వెళ్ళినట్టు తెలుస్తోంది. ఇలా గంగవ్వ విమాన ప్రయాణం చేస్తున్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై స్పందిస్తూ హ్యాపీ జర్నీ గంగవ్వ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…