Senior Actor Kavitha : చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలుపెట్టి తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు ఇలా అన్ని భాషలలోనూ హీరోయిన్ గా చేసిన కవిత గారు తెలుగులోనూ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ చాలా సినిమాల్లో నటించిన ఆమె అటు రాజకీయాల్లో ఉంటూనే నటి గా సీరియల్స్ లోనూ కనిపిస్తూ నటనను కంటిన్యూ చేస్తున్నారు. ఇక అప్పటి ఇండస్ట్రీ ముచ్చట్లు, గొడవల గురించి తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఆ సినిమాలో సిగరెట్ తాగాను…
కవిత తన సినిమా ప్రస్థానం గురించి మాట్లాడుతూ ఇప్పటి హీరోయిన్స్ లాగా కాదు, అప్పటి హీరోయిన్స్ సినిమాల్లో గెటప్ బట్టి ఏ సినిమానో చెప్పేవాళ్ళు. ఇప్పుడు హీరోయిన్స్ అన్ని సినిమాల్లోనూ ఒకేలాగ గ్లామర్ లుక్ తో కనిపిస్తారు అంటూ చెప్పారు. తన సినిమా ‘శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మహత్యం’ సినిమాలో ఎలా అవకాశం వచ్చిందో చెప్పారు కవిత. ఆ సినిమాకు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు ఆల్రెడీ ఒక టాప్ హీరోయిన్ ను సెలెక్ట్ చేసి ఆమెతో రెండు రోజులు షూటింగ్ కూడా చేసారు. అదే సమయంలో సీనియర్ హీరోయిన్ అంజలి దేవి గారు డైరెక్టర్ తో ఈ సినిమా కోమటి వాళ్ళ కుల దేవత గురించి కదా, ఇండస్ట్రీలో మన కోమటి పిల్లే హీరోయిన్ గా ఉంది కదా, తనతోనే సినిమా చేయొచ్చుకదా అని అన్నారట.
దాంతో డైరెక్టర్ గారు మళ్ళీ కవిత గారిని పెట్టి సినిమా చేశారట. ఇక కృష్ణ గారి సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా చేస్తున్న సమయంలో ఆయన తనను కాకుండా ఇంకో హీరోయిన్ ను ప్రేమించాలని ఆ సినిమాలో కవిత పాత్ర సిగరెట్ తాగాల్సి వచ్చిందట. అయితే నిజంగా సిగరెట్ తాగలేదు కానీ మామూలుగానే ఆ వాసన పడదు ఇక సీన్ కోసం చేయాల్సిన వచ్చినపుడు ఎక్కువ టేకులు తీసుకుందట. ఇక మరో సినిమాలో చేపలు అమ్మే పాత్ర చేయాల్సి వచ్చినపుడు వెజిటేరియన్ అవడం వల్ల చేపలను పట్టుకుని తోమాలని చెప్పినపుడు బాగా ఏడ్చాను అంటూ చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…