MM Srelekha: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు రాజమౌళి ఆయన సోదరుడు కీరవాణి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకి కీరవాణి సంగీతం తోడైతే ఆ సినిమా పక్కా హిట్ అవ్వాల్సిందే.తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో మేజర్ సక్సెస్ క్రెడిట్ తన అన్నయ్య కీరవాణిదే అని రాజమౌళి చెప్తుంటారు. రాజమౌళి తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తే.. కీరవాణి తన పాటతో ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
ఇక ఇటీవల ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు పలు ప్రశంసలు, పురస్కారాలతో పాటు ఏకంగా ఆస్కార్ నామినేషన్ సాధించాడు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమాలకు కీరవాణి బాణీలు అందించటమే కాకుండా వారి కుటుంబ సభ్యులందరూ కూడా తమ వంతు పనిచేస్తూ సినిమా సక్సెస్ చేయటానికి కష్టపడుతూ ఉంటారు. రాజమౌళి భార్య రమా, కొడుకు కార్తీకేయ, కీరవాణి, ఆయన భార్య శ్రీవల్లి, కొడుకు భైరవ, తమ్ముడు కళ్యాణి మాలిక్ సినిమాకోసం కష్టపడుతూ ఉంటారు.
ఇలా కుటుంబానికి చెందిన వారందరూ కలిసి సమిష్టి కృషితో సినిమాని సక్సెస్ చేస్తూ ఉంటారు. అయితే రాజమౌళి కీరవాణి చెల్లెలు ఎం ఎం శ్రీలేఖ కూడా మ్యూజిక్ డైరెక్టర్గా మంచి గుర్తింపు పొందింది. అయితే రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలలో శ్రీలేఖకు చోటు ఉండదు. అందువల్ల కీరవాణి, రాజమౌళి ఇద్దరూ తమ సోదరిని దూరం పెట్టారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వీరు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలలో కూడా శ్రీలేఖ ఎప్పుడూ కనిపించదు. దీంతో అన్నలిద్దరూ కలిసి చెల్లెల్ని దూరం పెట్టారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా శ్రీలేఖ షేర్ చేసిన ఒక్క ఫోటోతో ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. సినిమా రంగంలో ప్లే బ్యాక్ సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా తన 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న శ్రీలేఖ ‘మ్యూజిక్ వరల్డ్ టూర్ ‘చేపట్టింది. ఈ వరల్డ్ టూర్ కి సంబంధించిన పోస్టర్ ని రాజమౌళి స్వయంగా రిలీజ్ చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలను తాజాగా శ్రీలేఖ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సోదరుడు రాజమౌళికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇంతకాలం అన్నాచెల్లెళ్ల మధ్య ఎడబాటు ఉందని వస్తున్న వార్తలకు ఈ ఒక్క ఫోటోతో శ్రీలేఖ సరైన సమాధానం చెప్పింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…