Movie News

Geetu Royal: పుష్ప 2 లో అవకాశం గురించి క్లారిటీ ఇచ్చిన గీతూ.. ఏమన్నారంటే?

Geetu Royal: బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు కంటెస్టెంట్ గీతూ రాయల్. చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఈమె ఎంతగానో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.ఇకపోతే టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా కొనసాగుతారు అనుకున్నటువంటి గీతూ అనూహ్యంగా తొమ్మిదవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఈ విధంగా అనుకోకుండా తాను బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కావడంతో ఎంతో కుమిలిపోయిన ఈమె తాను వెళ్ళనని తనను పంపించకండి అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఇంటర్వ్యూలలో పాల్గొనని ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తన ఓవర్ కాన్ఫిడెన్స్ తనని ఎలిమినేట్ చేసేలా చేసింది అంటూ బిగ్ బాస్ ఓటమిని అంగీకరించారు. అదేవిధంగా తనని ప్రమోట్ చేయమంటూ కొందరికి డబ్బు ఇచ్చినప్పటికీ వాళ్ళు తన గురించి ఎలాంటి ప్రమోషన్స్ చేయలేదని ఆవేదన చెందారు.ఇక బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ గెల్చుకోవడానికి రేవంత్ ఆదిరెడ్డి మాత్రమే అర్హులని వాళ్ళిద్దరిలో ఒకరి టైటిల్ విన్నర్ అవుతారంటూ ఈమె ధీమా వ్యక్తం చేశారు.

Geetu Royal: ఇప్పటివరకు నన్ను ఎవరు కలవలేదు…

ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా పుష్ప2 లో అవకాశం వచ్చిందనీ వార్తలు వస్తున్నాయి ఎంతవరకు నిజం అని ప్రశ్నించగా ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ పుష్ప సినిమా కో డైరెక్టర్ నా నెంబర్ తీసుకున్నారని తెలిసింది. అయితే ఇప్పటివరకు ఎవరు కూడా నన్ను నేరుగా కలవలేదని ఈమె సమాధానం చెప్పారు.ఇలా పుష్ప సినిమా కో డైరెక్టర్ తన నెంబర్ తీసుకున్నారంటే తప్పకుండా తనకు సినిమాలలో అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.ఇక ఈమె లాంగ్వేజ్ కూడా చిత్తూరు యాసలో ఉండడంతో తప్పకుండా ఈమెకు పుష్ప సినిమాలో అవకాశం వస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే తనకు అవకాశం కల్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago