Geetu Royal: బిగ్ బాస్ రివ్యూల ద్వారా ఎంతో ఫేమస్ అయ్యి ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు నటి గీతూ రాయాల్. ప్రస్తుతం ఈమె రివ్యూల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకొని జబర్దస్త్ కార్యక్రమం శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఈమెకు పాల్గొనే అవకాశం వచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ వీడియో షేర్ చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. తనని చాలామంది చిన్నప్పటినుంచి బాడీ షేమింగ్ చేస్తున్నారని, ఇలా తన బాడీ గురించి మాట్లాడటంతో ఇతరులకు ఛాన్స్ ఇవ్వకుండా తను నిండుగా దుస్తులను దరిస్తున్నానని ఈమె తెలిపారు. అయితే నా స్నేహితులు కజిన్స్ ఇతర మాటలను పట్టించుకోకుండా నీ శరీరాన్ని నువ్వు ప్రేమించు అని చెప్పినట్లు ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
ఇలా తనని చాలామంది బాడీ షేమింగ్ చేయడం ఎంతో బాధగా ఉందంటూ కంటతడి పెట్టుకున్నారు. అయితే ఈ వీడియో పై షణ్ముఖ జశ్వంత్ అభిమానులు మాత్రం ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. గత సీజన్ లో షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో నువ్వు అతనిని బాడీ షేమింగ్ చేయలేదా అంటూ పెద్ద ఎత్తున ఈమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే తాను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మాత్రమే తన గురించి మాట్లాడానని అక్కడ ఆ కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ ఇవ్వడమే తన పని అంటూ సమాధానం చెప్పారు.
ఆయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనను ఒక మాట కూడా అనలేదని, అలాంటి అవసరం నాకు లేదని ఈమె తెలిపారు. అయితే నా బాధ ఇలా బయటకు చెప్పడంతో చాలామంది నన్ను సింపతి కోసమే ఇలా చేస్తున్నానని అంటున్నారు. ఇలా సింపతి కోసం చేయాల్సిన అవసరం తనకు ఏ మాత్రం లేదని, తనకు ఎంతో టాలెంట్ ఉందని ఈమె ఘాటుగా సమాధానం చెప్పారు. ఇకపోతే తాను ఎవరినైనా బాడీ షేమింగ్ చేస్తున్నట్లు కనుక వీడియోలు ఉంటే వాటిని తనకు పంపించాలని అదే కనుక నిజమైతే తాను బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి కూడా ఏమాత్రం వెనకాడనని గీతూ రాయల్ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.
మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…
పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…
2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…
అంతరిక్ష రంగంలో కెరీర్ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…