Gemini Ganeshan daughter Kamala Selvaraj : అలనాటి మహానటి సావిత్రి గారి జీవితం గురించి మహానటి సినిమా వచ్చింది. ఆమె కెరీర్ పరంగా ఎంతో సక్సెస్ అయినా వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేదు. అప్పటికే రెండు పెళ్ళిళ్ళు అయిన తమిళ నటుడు జెమినీ గణేశన్ గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన మూడో భార్య సావిత్రితో కూడా లేకుండా వేరొకరితో ఉండటం భరించలేని సావిత్రి గారు మందుకు బానిస అవడంతో ఆస్తులు పోగొట్టుకుని తుది దశలో చాలా కష్టాలు పాడ్డారు. ఇదంతా సినిమాలో చూపించిన స్టోరీ అయితే నిజానికి అలా ఏం జరగలేదని జెమినీ గణేశన్ కూతురు కమలా సెల్వరాజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
మా నాన్న చాలా మంచివారు…
కమలా సెల్వరాజ్ వైద్యురాలిగా స్థిరపడ్డారు. ఆమె తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి మాట్లాడారు. తన తండ్రి చాలా అందంగా ఉంటారని చాలా డీసెంట్ అంటూ చెప్పారు. ఆయన జీవితంలో మూడు పెళ్ళిళ్ళు ఆయన రాత అంటూ చెప్పారు. రహస్యంగా ఎన్నో అఫ్ఫైర్స్ చాలా మంది మెయింటైన్ చేస్తారు. ఆయన అలా చేయలేదు, ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం అంటూ చెప్పారు.
ఇక తాను తెలుగు సినిమాలను ఎక్కువగా చూడనంటూ చెప్పిన ఆమె మహానటి లో అన్ని వాస్తవాలు లేవంటూ చెప్పారు. తన తల్లి ఎపుడూ భర్త, పిల్లల కోసమే అన్నట్లు బ్రతికారని చెప్పారు. సావిత్రి గారు బాగా మద్యానికి బానిసవడం వల్లే అనారోగ్యంతో మరణించారని, పిల్లలందరికీ విబేధాలు లేవని, సావిత్రి తో కూడా చాలా బాగా ఉండేవాల్లమంటూ కమల చెప్పారు.
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…
ప్రముఖ సినీ నటి తమన్నా భాటియా దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ‘పవర్ సోప్స్’…
ఇప్పటివరకు గర్భనిరోధక బాధ్యత ఎక్కువగా మహిళలపైనే ఉండేది. మాత్రలు, ఇతర పద్ధతులు ఎక్కువగా మహిళలకే పరిమితమయ్యాయి. అయితే వైద్యరంగంలో తాజా…
ఉదయం పరగడుపున పండ్లు తినాలా లేదా అనే సందేహం చాలా మందిలో కనిపిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఖాళీ…