Director Teja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ తేజ ఒకరు. తాజాగా ఈయన అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా జూన్ 2వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా విలేకరులు అడిగే ప్రశ్నలకు తేజ తన స్టైల్ లో సమాధానం చెప్పారు..ఈ సందర్భంగా విలేకరి ప్రశ్నిస్తూ సినిమాలో అంతా హింస చూపిస్తూ సినిమాకు అహింసా అని ఎందుకు టైటిల్ పెట్టారని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు తేజ సమాధానం చెబుతూ అహింస అని టైటిల్ పెట్టి గాంధీ గారితో సినిమా చేయలేం కదా అని తెలిపారు.
ఈ సినిమాకు హింస కరెక్టా అహింస కరెక్ట్ అనేది సినిమా చూస్తే తెలుస్తుందని ఈయన సమాధానం చెప్పారు. ఇకపోతే షూటింగ్ సమయంలో డైరెక్టర్ తేజ హీరో హీరోయిన్లపై కొన్నిసార్లు చేయి చేసుకుంటారన్న వాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే ఒక విలేఖరి ఈ విషయం గురించి తేజన ప్రశ్నిస్తూ ఈ సినిమాలో కూడా హీరో హీరోయిన్ల పై చేయి చేసుకున్నారా అని ప్రశ్నించారు.
ఈ విధంగా విలేఖరి హీరో హీరోయిన్లను కొట్టారా అంటూ ప్రశ్నించడంతో రియాక్ట్ అయిన తేజ సమాధానం చెబుతూ నేను హీరో హీరోయిన్లను కొట్టడం నువ్వు ఎప్పుడైనా చూసావా అంటూ తన స్టైల్ లో తిరిగి విలేకరికి ఎదురు ప్రశ్న వేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా కోసం హీరో అభిరామ్ ను బాగా టార్చర్ పెట్టానని తేజ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…