సాధారణంగా అమ్మాయిలకు పువ్వులంటే ఎంతో ఇష్టపడుతుంటారు. అందమైన పువ్వులు కనిపిస్తే చాలు వాటిని తాకకుండా, వాటితో సెల్ఫీలు దిగకుండా ఉండలేరు. అదేవిధంగా మరికొందరు కొన్ని పుష్పాలు వెదజల్లే సువాసనలను ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు. తాజాగా ఇద్దరమ్మాయిలు ఎంతో అందమైన పుష్పాలు కనిపిస్తే వాటి వాసన చూస్తూ వీడియో దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి అసలు సమస్యలను తీసుకు వచ్చింది.
కెనడాలోని.. టొరంటోలో సింగర్ రఫేలా వెమన్ అక్కడే నివసిస్తోంది. ఈ క్రమంలోనే తను తన స్నేహితులను కలిసింది. అక్కడ ఎంతో అందమైన పుష్పాలు కనిపించడంతో రఫేలా, తన స్నేహితురాలు ఎల్లా ఇద్దరూ కలిసి ఆ పువ్వులను కోసి వాటి సువాసన చూస్తూ సెల్ఫీలు, వీడియోలు దిగారు. ఈ విధంగా ఆ పువ్వుల వాసన చూస్తున్నటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.
ఈ విధంగా ఇద్దరూ కలిసి ఆ పువ్వు వాసన చూస్తున్నంతసేపు వారికి ఏమీ కాలేదు. ఈ క్రమంలోనే వారిద్దరూ కలిసి తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న వీరిద్దరి ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో వారు పార్టీ నుంచి వెనుదిరిగారు. ఆ తరువాత వీరిద్దరూ చూసిన పువ్వులు వాసన ఎంతో ప్రమాదకరమైనదని. ఆ వాసన చూడటం వల్లే వీరికి ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకున్నారు.
వీరిద్దరూ ఆరోగ్యం నుంచి కోలుకున్న తరువాత రఫేలా మాట్లాడుతూ.. వారు వాసన చూసిన పువ్వులను ట్రంపెట్ అంటారు. ఈ పువ్వులను ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్కోపోలామైన్తయారీలో ఉపయోగిస్తారనే విషయం వారికి తెలియక ఈ పువ్వుల వాసన చూసి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. అందుకే ఇకపై మనకు తెలియని పుష్పాలను ఎవరు తాకకూడదని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…