1991 గ్యాంగ్ లీడర్, అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు లాంటి కమర్షియల్ సినిమాలు వచ్చిన సంవత్సరంలో భారత్ బంద్ లాంటి ఓ వివాదాస్పదమైన చిత్రాన్ని కోడి రామకృష్ణ రూపొందించడం జరిగింది. వినోద్ కుమార్, అర్చన, రెహమాన్ కాస్ట్యూమ్ కృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు ఈ సినిమాను రూపొందించడం జరిగింది.
తన సినిమాలో విలన్స్ ని ప్రత్యేక శైలిలో చూపించే కోడిరామకృష్ణ ఈ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ ను ఒళ్ళు గగుర్పొడిచే విలన్ పాత్రలో చూపించారు. అంకుశం లో రామ్ రెడ్డి తో బయటపెట్టిన కోడి రామకృష్ణ భారత్ బంద్ లో కాస్ట్యూమ్ కృష్ణ తో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆనాటి సమకాలీన అంశాలను ప్రధాన అంశంగా తీసుకొని భారత్ బంద్ సినిమాను రూపొందించడం జరిగింది. కాస్ట్యూమ్ కృష్ణను పెళ్ళాం చెబితే వినాలి సినిమాలో దర్శకుడు కోడి రామకృష్ణ పరిచయం చేయడం జరిగింది.
పెళ్ళాం చెబితే వినాలి చిత్రంలో మామూలు సాధారణ పాత్రలో కనిపించిన కాస్టూమ్స్ కృష్ణ తర్వాత భారత్ బంద్ లో కనిపించిన కాస్ట్యూమ్ కృష్ణ కి చాలా తేడాను మనం గమనించవచ్చు. కిళ్ళీకొట్టు నడుపుకుంటూ నేరాలు చేసే సామాన్యుడిని ఎమ్మెల్యే తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కావడం ప్రేక్షకులను అబ్బుర పరుస్తుంది. కాలేజీ లెక్చరర్ గా అర్చన తనదైన నటనను కనబరిచారు. విలన్ తన అనుచరులు సామాన్య ప్రజల్ని ఏవిధంగా మోసం చేస్తున్నారో తెలిసి వాటిని ఖండిస్తుంది.
అయితే ప్రారంభంలో చార్మినార్, అసెంబ్లీ దాని పరిసర ప్రాంతాలు మరియు కర్ఫ్యూ సమయాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం ఉద్రిక్త వాతావరణానికి దారి తీస్తుందని.. ఆ సమయంలో షూటింగ్ వాయిదా వేసుకోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయని అప్పుడు నిర్మాతకు దర్శకుడికి మధ్య మనస్పర్ధలు వస్తాయని కోడి రామకృష్ణ భారత్ బంద్ సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…