వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కిన దేవదాసు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అప్పట్లో ఇలియానాకు ఉన్న క్రేజ్ చూసి దర్శక నిర్మాతలు షాక్ అయ్యేవారు.
సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేకుండా సినిమా కోసం ఎదురు చూస్తుంది. ఇకపోతే తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇలియానా బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఇలియానా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈమె వ్యక్తిగత విషయానికివస్తే ఇలియానా ఒక విదేశీ వ్యక్తితో ప్రేమలో పడి తన కెరీర్ని నాశనం చేసుకుందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఇక ఈ ముద్దుగుమ్మ కు 35 సంవత్సరాలు దాటిన ఇంకా పెళ్లి ప్రస్తావన తీసుకు రాకపోవడంతో అసలు ఇలియానా పెళ్లి చేసుకుంటారా అనే అనుమానాలు వస్తున్నాయి. తాజాగా ఇలియానా పెళ్లి విషయంలో షాకింగ్ విషయం బయటపడటంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలియానా బాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉందని అయితే పిల్లలు ఉన్న ఈమె రహస్యంగా అతనితో ప్రేమ కొనసాగిస్తుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. అందుకే ఇలియానా పెళ్లి విషయం గురించి ప్రస్తావించలేదని వార్తలు వస్తున్నాయి. మరి తన గురించి వస్తున్న ఈ వార్తలపై ఇలియానా ఏవిధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…