God Father: ప్రస్తుత కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే సౌత్ హీరోలు నటించే సినిమాలలో బాలీవుడ్ హీరోలు గెస్ట్ పాత్రలలో నటించగా బాలీవుడ్ హీరోల సినిమాలలో సౌత్ సెలబ్రిటీలు గెస్ట్ పాత్రలలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ అతిధి పాత్రలో సందడి చేయనున్నారు.ఇక ఈ సినిమా కథ వినగానే తాను ఏమాత్రం ఆలోచించకుండా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను అంటూ సల్మాన్ ఖాన్ తెలియజేశారు.
ఇకపోతే సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి మల్టీ స్టార్ సినిమాలు ఎంతో అవసరం అని తెలిపారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో 300 _400కోట్ల బిజినెస్ వరకు మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ మల్టీ స్టార్ సినిమాలు చేస్తే ఈ బిజినెస్ మరింత పెరిగే అవకాశం ఉందని సల్మాన్ ఖాన్ వెల్లడించారు.
చిరంజీవి అభిమానులు నన్ను ఆదరించి నా అభిమానులు చిరంజీవిని ఆదరిస్తే పెద్ద అభిమాన లోకం అవుతుందని, ఇద్దరం కలిసి నటిస్తే మూడు వేల కోట్ల బిజినెస్ చేయవచ్చు అంటూ ఈ సందర్భంగా సల్మాన్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక నార్త్ సౌత్ సెలెబ్రిటీలు కలిసిన నటించడం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఎంతో ప్లస్ పాయింట్ అవుతుందని ఇది ఇండియన్ సినిమా అంటూ ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…