Gone Prakash Rao : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఇష్యూ ఈ మధ్యలో ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ లిక్కర్ స్కాం. ఇందులో రోజుకో పేరు చెబుతూ రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కాం మంటలు రేగుతున్నాయి. బీజేపీ కావాలనే తన ప్రత్యర్థులను ఈ స్కాంలో ఇరికిస్తూ వేదిస్తున్నారు అనే ఆరోపణల నడుమ తెలంగాణ సీఎం కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం లో వినిపించడంతో అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈడి ఆమె పేరు చేర్చడంతో తెలంగాణ రాజకీయాల్లో నిప్పు రాజుకుంది. ఆప్ నేతలకు వందల కోట్ల ముడుపులు అందిన కేసులో కవిత ఉన్నారని, పేమెంట్ కి సంబంధించిన ఫోన్లు డిజిటల్ ఎవిడెన్స్ లు దొరక్కుండా ధ్వంసం చేసారంటూ ఈడి పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్ లో తన పేరు ప్రస్తావన తో కవిత ఈ ఇష్యూ మీద సీరియస్ గా స్పందించారు. జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం, ఈడి మోడీలకు భయపడేది లేదు అంటూ ఫైర్ అయ్యారు. ఈ ఇష్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ ఇష్యూ మీద గోనె ప్రకాష్ రావు గారు మాట్లాడారు.
అప్పుడు పీక్కోమని అన్నారు… ఇప్పుడు ఎందుకు భయం…
లిక్కర్ స్కాం గురించి గోనె ప్రకాష్ రావు గారు మాట్లాడుతూ బీజేపీ ఏం చేసినా కెసిఆర్ ముందు నుండి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు వీరి వరకు వచ్చేసరికి బీజేపీ దేశంలో తొమ్మిది ప్రభుత్వాలను కూల్చింది అంటూ కవిత ఆరోపిస్తోంది. నొప్పి ఇప్పుడు మీ మీదకు వచ్చాక కనిపిస్తోందా అంటూ మాట్లాడారు. లిక్కర్ స్కాంలో కవిత ప్రమేయం లేకపోయినా ఆమె పేరును వాడుకుని డబ్బు ఇచ్చి అందులో కొంతమంది ఉండొచ్చు అంటూ అభిప్రాయపడ్డారు గోనె ప్రకాష్ రావు గారు. తండ్రి కెసిఆర్ పుట్టినరోజు నాడు తిరుమలకు కుటుంబంతో వెళ్లిన కవిత అక్కడ లిక్కర్ స్కాంలో ఉన్న అభిషేక్ తదితరులతో పాటు ఉండటం ఆ ఫోటో ఆనాడు మీడియాలో కూడా వచ్చింది.
దీనికి కవిత సమాధానం చెప్పాలి అంటూ గోనె ప్రకాష్ మాట్లాడారు. ఏపీ నుండి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి సంబంధిచిన వారు మూడు కోట్లతో టెండర్ వేసారు కానీ కవిత ఇందులో ఉన్నారని భావించడం లేదు అంటూ గోనె ప్రకాష్ అన్నారు. అయితే ఆమెకు సంబంధిచిన మనుషులు ఇందులో ఉండటం వల్ల ఇప్పుడు ఆమె ఈ స్కాంలో ఇరుక్కున్నారు అంటూ అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు బీజేపీ తో దోబూచులాడారు, ఇక మీరే వారి చేతిలో ఇరుక్కున్నారు అంటూ విమర్శించారు గోనె ప్రకాష్ రావు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…