Categories: FeaturedMovie News

Balakrishna : బాలయ్య, శ్రీ దేవి కాంబినేషన్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా?? అసలు కారణం అదే…!

Balakrishna : అలనాటి అందాల తార శ్రీ దేవి తన సినిమా కెరీర్ లో హీరోలతో సమానంగా క్రేజ్ అలాగే రెమ్యూనరేషన్ అందుకున్న నటి. సూపర్ స్టార్ గా ఎదిగిన శ్రీ దేవితో పాతతరం నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు ఇలా అందరి హీరోలతో నటించింది. ఇక కొత్త తరం నటుల్లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున తో కూడా నటించింది హిట్లు అందుకున్న ఈ ముద్దు గుమ్మ బాలకృష్ణ తో మాత్రం నటించలేదు. ఒకటి రెండు సార్లు వీరిద్దరి కాంబో సెట్ అయినా చివరి నిమిషంలో హీరోయిన్ మారిపోయింది.

ఆ కారణాల వల్ల కాంబినేషన్ కుదరలేదు…

బాలకృష్ణ శ్రీ దేవి కాంబినేషన్ లో మొదటగా సినిమా చేయాలని భావించింది మాత్రం దర్శకేంధ్రుడు రాఘవేంద్ర రావు. ఆయన బాలకృష్ణ శ్రీ దేవి కాంబోలో ‘సాహస సామ్రాట్’ సినిమా చేయాలని భావిస్తే ఎందుకనో ఎన్టీఆర్ గారు వద్దన్నారట. దీంతో ఆ సినిమాలో హీరోయిన్ గా విజయశాంతిని తీసుకున్నారు. ఇక మరోసారి వీరి ఇద్దరి కాంబినేషన్ ట్రై చేసింది కోదండ రామిరెడ్డి. ఆయన బాలకృష్ణ తో చేసిన సినిమా ‘భలే దొంగ’ లో మొదట శ్రీ దేవి ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.

శ్రీ దేవి కూడా కోదండ రామిరెడ్డి అడుగుంటే ఖచ్చితంగా ఒప్పుకుని ఉండేవారు అయితే ఆ సమయంలో నందమూరి అభిమానులు అభ్యంతరం చెప్పి ఏకంగా ఎన్టీఆర్ వద్దకు వెళ్లి వద్దని చెప్పారట. దీంతో మరోసారి ఎన్టీఆర్ గారు ఆ కాంబినేషన్ కి నో చెప్పేసారు. అంతే కాకుండా బాలకృష్ణ కూడా తండ్రి ఎన్టీఆర్ కు హిట్ పెయిర్ గా నిలిచిన హీరోయిన్ తనకు తల్లితో సమానం అని భావించి చేయడాని నిరకరించారనే టాక్ కూడా ఉంది. ఏది ఏమైనా ఈ ఇద్దరి కాంబోలో ఒక సినిమా వచ్చుంటే ఎలా ఉందేదో మరి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago