Telangana : మహిళా సంఘాల సభ్యుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్ప శుభవార్తను ప్రకటించింది. మహిళా సంఘాల సభ్యుల ఆదాయాన్ని పెంచేందుకు, వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇకపై మహిళలు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్నారు.
అంతేకాదు, ప్రతి ఇంటిపై విద్యుత్ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల కరెంట్ బిల్లుల బాధ తప్పుతుంది. ప్రతి సంవత్సరం లక్ష మంది సభ్యుల ఇళ్లపై సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే, రాబోయే రోజుల్లో లక్షలాది ఇళ్లు వెలుగులతో కళకళలాడనున్నాయి.
శ్రీనిధి సమాఖ్య ద్వారా మహిళా సంఘాలలోని సభ్యులకు నాలుగు శాతం వడ్డీ రాయితీతో రుణాలు అందజేస్తారు. తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులో ఉండటంతో, మహిళలు తమ సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా ఉన్న వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఇది గొప్ప అవకాశం. కేంద్ర ప్రభుత్వం కూడా రూ. 78000 రాయితీని అందజేస్తుంది. ఇది నిజంగా మహిళలకు ఒక వరంలాంటింది.
ఈ సోలార్ యూనిట్లు 25 ఏళ్ల వరకు పనిచేస్తాయి. అంటే, ఒకసారి ఏర్పాటు చేసుకుంటే పాతికేళ్ల వరకు కరెంట్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఐదేళ్లలో అప్పు తీరిన అనంతరం 20 ఏళ్లు విద్యుత్ అమ్మకాల ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. అంటే కరెంట్ ఉత్పత్తి చేసి అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఈ విధానాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే మహిళా సంఘాల నేతలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మహిళా సాధికారతకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది.
ఉదయం వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు చెబుతుంటారు. బరువు నియంత్రణ నుంచి గుండె ఆరో్యం వరకు ఎన్నో…
వేసవి కాలంలో ఎండలు పెరిగిపోవడంతో చాలామంది చల్లటి నీళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే…
వేసవి కాలంలో మామిడిపండ్లు అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం. రోజూ మామిడి తినకుండా ఉండలేని వారూ ఉంటారు. అయితే…
వేసవి వచ్చిందంటే పిల్లలకు సెలవులు, ఆటలు, సరదాలు మొదలవుతాయి. ఈ సమయంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్విమ్మింగ్ క్లాసులకు…
వేసవి కాలం వచ్చిందంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో…
హిందువుల అత్యంత పవిత్ర తీర్థయాత్రల్లో ఒకటిగా భావించే కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. 2026…