Movie News

Gopichand Malineni: అప్పుల బాధతో ఆస్తులన్నీ అమ్మేశాము… గోపీచంద్ కష్టాలు మామూలుగా లేవు!

Gopichand Malineni: చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి అందరికీ సుపరిచితమే ఈయన ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ అందుకుంటు దూసుకుపోతున్నారు. క్రాక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ మల్లినేని అనంతరం బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమా చేశారు.

ఈ సినిమా కూడా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్, నిర్మాత ,హాని రోజ్ వరలక్ష్మి శరత్ కుమార్ వంటి తదితరులు పాల్గొన్నారు.

ఇలా బాలకృష్ణ చిత్రం బృందంతో సరదాగా ముచ్చటిస్తూ ఎన్నో సినిమా విశేషాలను పంచుకున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బాలయ్య రవితేజకు ఫోన్ చేసి ధమాకా సక్సెస్ తెలియజేశారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి తనదైన శైలిలో మాట్లాడుతూ ఆట పట్టించారు. ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని గురించి మాట్లాడుతూ ఈయన పలు విషయాలను బయటపెట్టారు.

Gopichand Malineni: ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్న గోపీచంద్…


గోపి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ క్రాక్ సినిమాకి ముందు ఏడాదిన్నర పాటు చాలా కష్టాలు పడ్డావట ఆస్తులు కూడా అమ్మేశావట ఆ సమయంలో ఏమనిపించింది అంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గోపీచంద్ స్పందిస్తూ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అదే సమయంలోనే నటి వరలక్ష్మి శరత్ కుమార్ తనని ఓదార్చారు. మరి క్రాక్ సినిమాకి ముందు ఏం జరిగింది? ఎందుకు ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందనే విషయం తెలియాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారం కావాల్సిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago