ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల వల్ల దేశ ప్రజలందరూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉపాధిని కోల్పోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఎంతోమంది విద్యార్థులు చదువును కోల్పోయే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే ఎంతో మంది ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం వల్ల విద్యార్థులకు చదువు భారంగా మారిపోయింది.ఈ విధంగా ప్రైవేట్ స్కూల్ కి వెళ్లి చదువుకునే విద్యార్థుల పట్ల ఒడిసా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే ఒడిసా ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలో 15 శాతం ఫీజులు తగ్గించాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఈ విధంగా ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు తగ్గించడం వల్ల ఎంతో మంది తల్లిదండ్రులకు కొంతవరకు ఆర్థిక భారం తగ్గుతుంది అన్న ఉద్దేశంతోనే రాష్ట్రప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఈ ఏడాది కరోనా ప్రభావం, లాక్ డౌన్ ఆంక్షల వల్ల పిల్లల చదువుల పై తీవ్రమైన ప్రభావం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఒడిశా హైకోర్టు సైతం వార్షిక ఫీజులో మినహాయింపు కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు జరగని పక్షంలో తల్లిదండ్రులు మరొకసారి కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా కల్పించింది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల పట్ల ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దిశగా అన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తే దేశంలో ఎంతో మంది తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బంది తగ్గడమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకుండా వారు చదువులు కొనసాగుతాయి.ఈ ఏడాది కూడా కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా తరగతులను నిర్వహించనున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…