General News

రైతులు ఈ పంటలు పండిస్తే.. లక్షల్లో ఆదాయం పొందవచ్చు తెలుసా?

భారత దేశంలో ఎక్కువ మంది వ్యవసాయం పైనే ఆధారపడి బతుకుతున్నారు. ఈ క్రమంలోనే రైతులు సంవత్సరంలో మూడు పంటలను సాగు చేస్తుంటారు. అయితే ఇతర సీజన్ లతో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో రైతులు అధికంగా పంట సాగుబడి చేస్తారు. పంటలను సాగు చేయడానికి ఖరీఫ్ ఎంతో అనువైన కాలం. ప్రస్తుత కాలంలో రైతులుపంటపై ఎక్కువభాగం పెట్టుబడులు పెట్టడం వల్ల వారికి పెద్దగా లాభాలు రావడం లేదు.ఈ క్రమంలోనే తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందే పంటలను సాగు చేయడం ద్వారా రైతులు లక్షల్లో లాభాలను పొందవచ్చు. ఖరీఫ్ సీజన్లో ఎటువంటి పంటకు సానుకూలం, ఏ పంటలు పెట్టడం ద్వారా ఆదాయం పొందవచ్చు అనేది తెలుసుకుందాం..

ఖరీఫ్ సీజన్లో కలబంద సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలను పొందవచ్చు. జులై నుంచి ఆగస్టు నెల మధ్యలో కలబంద సాగు చేయడం ద్వారా ఎకరాకు ఏకంగా 2 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.ఎన్నో ఔషధ గుణాలు దాగిఉన్న కలబందను వివిధ రకాల ఔషధాలలో సౌందర్య ఉత్పత్తుల్లో విరివిగా వాడటం వల్ల ఈ పంటకు ఎంతో డిమాండ్ ఉంటుంది.

మైదాన ప్రాంతాలలో విత్తనాల ద్వారా పండించే కౌంచ్ పంట ద్వారా ఎకరాకు మూడు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు. జూన్ నుంచి జూలై మధ్యలో ఈ పంటను సాగు చేయడానికి ఎంతో అనువైన సమయం. ఈ పంటను సాగు చేయడానికి ఎకరానికి 3 కిలోల నుంచి 5 కిలోల విత్తనాలు అవసరమవుతాయి.

మన దేశాలలో పాటు ఇతర దేశాలలో కూడా పండించే ఔషధ పంటలలో లెమన్ గ్రాస్ ఒకటి. ఎకరా లెమన్ గ్రాస్ పంటకు 30వేల రూపాయల నుంచి 40వేల రూపాయల పెట్టుబడి పెడితే ఒక ఎకరానికి సుమారుగా 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు. ఈ పంటను సాగు చేయడానికి ఖరీఫ్ కాలం ఎంతో అనువైనది. ఈవిధంగా ఖరీఫ్ సీజన్లో ఈ పంటలు పండించడం ద్వారా రైతులు లక్షల్లో ఆదాయం పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నటితో అనుసంధానం చేస్తూ సీఎం విజయ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. మాజీ మంత్రిపై కేసు

తమిళనాడు రాజకీయాలు మరోసారి తీవ్ర వేడిని సంతరించుకున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రోజురోజుకూ ముదురుతున్న…

6 hours ago

అరుదైన గజకేసరి యోగం.. ఈ రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర దృష్టులు మనిషి జీవితంపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. గ్రహాల ప్రత్యేక కలయికల…

6 hours ago

బంగారం ధరలు భారీగా పతనం.. ఒక్కరోజులోనే వేల రూపాయల తగ్గుదల.. తాజా ధరలు ఇవే!

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి భారీ ఊరట లభించింది. గత కొన్ని వారాలుగా క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి…

6 hours ago

పెరుగులో ఉప్పు మంచిదా? చక్కెర మంచిదా? ఆరోగ్య నిపుణులు చెప్పే అసలు నిజం ఇదే!

భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…

22 hours ago

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈ దేశాలకు వెళ్లితే పసిడి కథే వేరు..

ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…

22 hours ago

ఔను.. నేను అమ్మను కాబోతున్నా.. అభిమానులకు శుభవార్త చెప్పిన సమంత

దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…

22 hours ago