గతకొన్నిరోజులుగా ఎండలు దంచికోట్టాయి. అయితే భానుడు కాస్త శాంతించడంతో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. భారీ వర్షాల కారణంగా వరదలకు వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు ముంపు ప్రాంత ప్రజలు. తాజాగా ఒక హైవే అందరూ చూస్తుండగా కుప్పకూలిపోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వర్షాల ధాటికి అరుణాచల్ ప్రదేశ్ రాజధాని నగరం ఇటానగర్‌లో అనేక భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో ఇటానగర్ గాంధీ పార్క్ జాతీయ రహదారి 415లో ఓ రోడ్డు ఒక్కసారిగా కూలిపోయింది. అలాగని ఆ రోడ్డు బ్రిటీష్ కాలం నాటిది కాదు ఈ మధ్యనే కొత్తగా నిర్మించారు. అయితే తాజగా కురిసిన వర్షాల ధాటికి రోడ్డు కుంగిపోయి ఈ ప్రమాదం జరిగిందని హైవే అధికారులు అంచనా వేస్తున్నారు.
మరో వైపు ఒక్కసారిగా రోడ్డు కుప్పకూలిపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ సమయంలో వాహనదారులు కాస్త అలర్ట్ గా ఉండడంతో భారీ ప్రమాదం తప్పింది. కాగా, వర్షానికి జాతీయ రహదారి రోడ్డు కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సదరు రహదారిని నిర్మించిన నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…