Featured

Gundamma Katha : షష్ఠి పూర్తి చేసుకున్న గుండమ్మ కథ.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల అద్భుత సాంఘిక చిత్రం వెనుక ఆసక్తికర విషయాలు….!

Gundamma Katha : తెలుగు వారు ఘనంగా చెప్పుకునే చిత్రాలలో గుండమ్మ కథ సినిమా ఒకటి. ఆంధ్రులు సముద్రాలు దాటి విదేశాల్లో ఉన్నా ఇప్పటికీ చూసే క్లాసిక్ సినిమా. కొన్ని సినిమాలు ఎప్పటికీ బోర్ కొట్టవు. అలాంటి చిత్రాల్లో అజరామరమైన చిత్రం గుండమ్మ కథ. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమాలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అంతే కాదు తెర వెనుక కూడా ఎన్నో గమ్మత్తైన విషయాలు ఉన్నాయి.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల 100 చిత్రం… ఇద్దరి కలయికలో 10 చిత్రం….

గుండమ్మ కథ సినిమాలో అప్పటి అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు కలిసి నటించిన ఈ సినిమాకు టైటిల్ మాత్రం సూర్యకాంతం పోషించిన గుండమ్మ పేరును పెట్టడం ఆ రోజుల్లో సాహసమే. కానీ కథపరంగా ఆ సినిమా గుండమ్మ చుట్టూ తిరుగుతుంది కాబట్టి అలా టైటిల్ పెట్టాలి. జూన్ 7 న 1962లో విడుదలైన ఈ సినిమా నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, జమున, సూర్యకాంతం, ఛాయా దేవి వంటి భారీ తారగణం నటించిన ఈసినిమా ఒక రీమేక్ చిత్రం. విజయం వారి సంస్థలు నుండి వచ్చిన మొదటి రీమేక్. కన్నడ సినిమా మనె తుంబిద హెణ్ణు కి రీమేక్. ఈ సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి గారి స్టూడియోలో చిత్రీకరించడం మరియు ఆర్ధిక సహాయం చేయడం వల్ల అందుకు కృతజ్ఞతగా నాగిరెడ్డి గారికి కన్నడ భాష మినహాయించి అన్ని భాషల రీమేక్ హక్కులను ఇచ్చారు. గుండమ్మ కథ సినిమాను మొదట బి.ఎన్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించాలనుకున్నా రీమేక్ సినిమాను అంత పెద్ద దర్శకుడితో తీయడం సబబు కాదని, పౌరాణిక చిత్రాలను తీసి గుర్తింపు తెచ్చుకున్న కమలాకర కామేశ్వరరావు దర్శకత్వానికి ఓటేసారు. ఈ సినిమా మూల కథ షేక్స్ పీయర్ రాసిన ట్రేమింగ్ అఫ్ ది ష్రూ ను ప్రాంతీయతకు తగ్గట్టు మార్చారు.

గుండమ్మ కథ సినిమా కన్నడ సినిమా విఠలాచార్య దర్శకత్వంలో వచ్చింది. ఇక తమిళం లో కూడా ఈ సినిమాను ఏంజీఆర్, అక్కినేనిలతో తీశారు నాగిరెడ్డి. ఇక కథ విషయానికోస్తే గుండు పోగుల వెంకటరామయ్య గారి రెండో భార్య గుండమ్మ సూర్యకాంతం సవతి కూతురి (సావిత్రి ) లక్ష్మితో వెట్టిచాకిరీ చేయిస్తుంటుంది. తన సొంత కూతురు (జమున )సరోజను గారాబంగా పెంచుకుంటుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు రామభద్రయ్య (ఎస్వీఆర్ ) ఇద్దరు కొడుకులు ఆ ఇంట్లో చెరో దారిన గుండమ్మ ఇంటికి వచ్చి కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత గుండమ్మ కూతురు సరోజకు వీరభద్రయ్య రెండో కుమారుడు రాజా ఎలా బుద్ది చెప్పాడు. చివరకు గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుందనేదే గుండమ్మ కథ.

ఇందులో బండోడిగా ఎన్టీఆర్, భార్యను మోసం చేసిన దొంగ పాత్రలో ఏఎన్ఆర్ లు చక్కగా నటించారు. సినిమాలోని అన్ని పాటలు అలరించాయి. ఘంటసాల గారి సంగీతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లేచింది నిద్ర లేచింది మహిళలు లోకం పాట, ప్రేమయాత్రలకు బృందావనం పాటలు ఇప్పటికీ వింటున్నాము. సినిమాలో మరో గమ్మత్తైన విషయం కోలో కోలో పాటలో ఎన్టీఆర్, సావిత్రిల పై షూటింగ్ ఒకసారి, ఏఎన్ఆర్, జమునలపై ఒకసారి చిత్రీకరించారు. అయినా ఒకేసారి అందరితో షూటింగ్ చేశారేమో అనేలా పాట ఉంటుంది. సినిమా మొదట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల పేర్లలో ఎవరిదీ ముందు వేయాలో తర్జనభర్జనలు చేసారు చివరికి వారి పేర్లు వేయకుండా వారి ఫోటోలను వేసి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. ఇక ఈ అద్భుత కావ్యాన్ని బాలకృష్ణ, నాగార్జున లతో తీయాలని భావించినా కుదరలేదు, ఇక వీరిద్దరూ ఈ సినిమా స్వయంగా రీమేక్ చేయానులకున్నా కుదరలేదు. మరి మూడో తరం జూనియర్ ఎన్టీఆర్, నాగచైతన్యలతో అయినా ఈ సినిమా రీమేక్ చేస్తారేమో చూడాలి.

Bhargavi

Recent Posts

ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్ చేంజ్‌లో చేయాల్సింది ఇదే!

వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…

4 hours ago

బీపీ, షుగర్ మాత్రమే కాదు.. 40 తర్వాత ఈ టెస్టులు కూడా అవసరం!

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…

4 hours ago

చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ ఘాటు కౌంటర్..!

మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…

4 hours ago

అక్షయ తృతీయ స్పెషల్: వాహనం కొనేటప్పుడు ఈ విషయాలు మిస్ అవొద్దు!

అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…

4 hours ago

పిల్లల్లో ఆటిజం సంకేతాలు ఇవేనా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…

4 hours ago

తిరుమల మాడ వీధుల రహస్యాలు.. ఈ ప్రదక్షిణకు అంతటి పవిత్రత ఎందుకు?

తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…

5 hours ago