బంగారాన్ని ప్రతీ ఒక్కరు ఇష్టపడతారు. ఎందుకంటే అది అలంకరణలో ఎంతో ఆకర్శవంతంగా ఉంటుంది. అంతేకాకుండా.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి.. ఆర్థికంగా భరోసా కల్పించడంలో కూడా అది తోడ్పడుతుంది. ఇలా కొంతమంది బ్యాంక్ లో బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులను తీసుకెళ్లారు.
తమ అవసరాలకు ఆ బంగారాన్ని వాడుకున్నారు. తర్వాత తమ బంగారు నగలు కావాలని.. డబ్బులను తీసుకొని బ్యాంక్ కు వచ్చిన వాళ్లకు పెద్ద షాక్ తగిలింది. అక్కడ వాళ్లు తాకట్టు పెట్టిన బంగారం కనిపించలేదు. దీంతో బ్యాంక్ సిబ్బంది కూడా షాక్ కు గురయ్యారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో చోటుచేసకుంది. కొంతకాలం క్రితం ఆ చట్టుపక్కల గ్రామస్తులు గోల్డ్ లోన్ కోసం వచ్చి.. తమ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకెళ్లారు.
తర్వాత తమ బంగారాన్ని విడిపించుకోడానికి బ్యాంక్ కు రాగా ఈ తతంగం మొత్తం జరిగింది. అధికారులు దీనిపై ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. బ్యాంకులో పనిచేచే అటెండర్ ఈ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్నట్లు తెలిసింది. అతడికి మరో ఇద్దరు బ్యాంక్ సిబ్బంది కూడా సహాయం చేశారు. అతడు క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులను పోగొట్టుకోవడంతో ఇలా.. బ్యాంక్ లో తాకట్టు పెట్టిన బంగారాన్ని తీసుకెళ్లి.. మరొక దగ్గర వాటిని తాకట్టు పెట్టి.. డబ్బులను తీసుకున్నట్లు తెలుస్తోంది.
బంగారు ఆభరణాలు మాయమైన వ్యవహారంపై బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడికి సహకరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…