Gunturu kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా టైటిల్ చూస్తేనే సినిమా పై ఎన్నో అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా నుంచి తాజాగా విడుదల చేసిన గ్లింప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇలా ఈ సినిమా నుంచి విడుదలైన మహేష్ లుక్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా మహేష్ బాబు నటిస్తూ ఉండగా ఈ సినిమాకు మాత్రం మహేష్ బాబు ఫస్ట్ ఛాయిస్ కాదని ఈ సినిమా కథను వేరే హీరో రిజెక్ట్ చేస్తేనే ఆ కథతో మహేష్ బాబు సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.మరి గుంటూరు కారం సినిమాని రిజెక్ట్ చేసిన హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా ఈ సినిమా కథను ఎన్టీఆర్ కోసం రాసారట.
ఎన్టీఆర్ RRRసినిమా తర్వాత కొరటాల సినిమా కాకుండా ఈ సినిమాలోని నటించాల్సి ఉంది అయితే స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ కాస్త సందేహాలను వ్యక్తపరుస్తూ కొన్ని మార్పులు చేయమని చెప్పారట. త్రివిక్రమ్ మార్పులు చేసిన ఎన్టీఆర్ కి నచ్చకపోవడంతో ఈ సినిమాని వదులుకున్నారని తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రాబోతున్నారని తెలుస్తుంది. మరి గుంటూరు కారం ప్రేక్షకులను మెప్పించగలరా లేదా తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…